హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mahabubnagar: నిరూపయోగంగా రైతు వేదికలు..పట్టించుకోని అధికారులు

Mahabubnagar: నిరూపయోగంగా రైతు వేదికలు..పట్టించుకోని అధికారులు

నిరూపయోగంగా రైతు వేదికలు

నిరూపయోగంగా రైతు వేదికలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకు మేలు చేయాలని ఉద్దేశంతో ప్రతి గ్రామంలో రైతు వేదికలు నిర్మించింది. ఈ రైతు వేదికల ద్వారా పలు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వారికి ఏ కాలంలో ఏ పంటలు వేయాలంటూ స్థానిక వ్యవసాయగా అధికారులు చేప్పాలి. కానీ వారికి అవగాహన కల్పించాల్సిన అధికారులు రైతు వేదికల వైపు కూడా చూడకుండా వేదికలకు తాళాలు కూడా తీయడం లేదు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nagarkurnool, India

(Syed Rafi, News18,Mahabubnagar)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకు మేలు చేయాలని ఉద్దేశంతో ప్రతి గ్రామంలో రైతు వేదికలు నిర్మించింది. ఈ రైతు వేదికల ద్వారా పలు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వారికి ఏ కాలంలో ఏ పంటలు వేయాలంటూ స్థానిక వ్యవసాయగా అధికారులు చేప్పాలి. కానీ వారికి అవగాహన కల్పించాల్సిన అధికారులు రైతు వేదికల వైపు కూడా చూడకుండా వేదికలకు తాళాలు కూడా తీయడం లేదు. దీనితో ఆ ప్రాంగణంలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. మరికొన్ని చోట్ల అయితే ఏకంగా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Karimnagar: బామ్మర్దిని చంపడానికి బావ పక్కా స్కెచ్..కానీ చివరకు ఏం జరిగిందంటే?

అధికారులు స్పందించి రైతు వేదికలపై రైతులకు అవగాహన కల్పించి వారికి మేలు చేయాల్సిందిగా రైతులు కోరుతున్నారు. పాలమూరు జిల్లాలోని రైతు వేదికలో రైతులకు సాగుపై అవగాహన కరువవుతుంది. డిసెంబర్ మొదటి వారం గడుస్తున్న ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలోని 18 శాతమైన పూర్తి కాలేదు. ఈ యాసంగిలో లక్షల ఎకరాల్లో సాగు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. డిసెంబర్ మొదటి వారం గడిచినా ఇప్పటివరకు కొన్ని ఎకరాల్లో మాత్రమే వివిధ పంటలు వేశారు.

ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలని అధికారులు చెబుతున్న కిందిస్థాయిలో మాత్రం అవగాహన కల్పించడం లేదు తప్పనిసరి అయితే వరి వేసుకోవాలని లేదంటే వేరుశనగ ఆయిల్ ఫామ్ తో పాటు ఇతర లాభ సాటి పంటలపై మొగ్గు చూపాలని చెప్తున్నారు. దీంతో యాసంగి సాగుపై రైతులు గందరగోళంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ అధికారులు సూచనలు, సలహాలు ఎంతో అవసరం. రైతు వేదికలో ఈ సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాల్సి ఉన్న ఎక్కడ సక్రమంగా అమలు కావడం లేదు. చాలా చోట్ల రైతులు వేదికలు భవనాలకు తాళాలు వేసి కనిపిస్తున్నాయి.

Subsidy Loans: గుడ్‌న్యూస్.. మైనారిటీలకు సబ్సిడీ లోన్లు.. ఎల్లుండి నుంచే దరఖాస్తులు.. అర్హత వివరాలు ఇవే

మరికొన్ని చోట్ల మరుగుదొడ్లు మంచినీటి సౌకర్యం లేదన్న సాగుతో వాటిని ఖాళీగానే ఉంచుతున్నారు. అక్కడ ఎలాంటి సమావేశాలు నిర్వహించడం లేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 476 రైతు వేదికలను ప్రభుత్వం నిర్మించింది. ఒక్కదానికి రూ 22 లక్షల చొప్పున మొత్తం రూ 104 కోట్ల ఖర్చు చేశారు. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ చొప్పున ఈ రైతు వేదికలు ఏర్పాటు చేశారు. రోజు ఉదయం 9 నుంచి 11:00 వరకు సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు వ్యవసాయ విస్తరణ అధికారులు రైతు వేదికలోనే ఉండాలి. మిగతా సమయాల్లో క్షేత్రస్థాయికి వెళ్లి రైతులతో మాట్లాడి ఆధునిక సాగుపై ప్రచారం నిర్వహించాలి. కానీ ఇవేమీ ఇక్కడ జరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యవసాయ అధికారులు మాత్రం కిందిస్థాయి అధికారులు ప్రతి ఏఈఓ రైతు వేదిక వద్దకు వెళ్లి హాజరైనట్లు ఫోటోలు తీసి అప్లో పెట్టాలని చెప్తున్నాం. వారానికి రెండు రోజులు ఈ వేదికలు రైతులతో సమావేశాలు పెట్టాల్సి ఉంటుందని అంటున్నారు.

కానీ వీటి ద్వారా ఏ మాత్రం రైతులకు మేలు జరగడం లేదు. ఉమ్మడి జిల్లాలోని రైతు వేదికలు అయినా ఖర్చులు మహబూబ్ నగర్ 88 రైతు వేదికలు ఖర్చు 19.36 కోట్లు.  నారాయణపేట 77 రైతు వేదికలకు 16.94 కోట్లు. నాగర్ కర్నూల్ 143 రైతువేదికలకు 31.46 కోట్లు. వనపర్తి 71 రైతువేదికలకు 15.62 కోట్లు. జోగులంబ గద్వాల్ 97 రైతువేదికలకు 21.32 ఖర్చు జరిగిన ప్రయోజనం లేకుండా పోతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు మేలు చేయాల్సిందిగా రైతులు కోరుతున్నారు.

First published:

Tags: Mahabubnagar, Telangana

ఉత్తమ కథలు