Home /News /telangana /

MAHABUBNAGAR FARMER TIRUPATAIAH IS EARNING LAKHS BY CULTIVATING OKRA IN TRADITIONAL CULTIVATION PRV MBNR

Business Plan: రూ. 20 వేలు పెట్టుబడితో 3 లక్షల ఆదాయం.. బెండకాయ సాగుతో లాభాలు ఆర్జిస్తున్న యువరైతు

బెండ సాగు

బెండ సాగు

మేకల తిరుపతయ్య డిగ్రీ పూర్తిచేసి ఆయన సాంప్రదాయ పంటల సాగుతో (Crop cultivation) పెద్దగా లాభం లేదని గుర్తించారు. ఆరేళ్లుగా కూరగాయలు సాగు (Vegetable Cultivation)పై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Mahbubnagar, India
    (Sayyad rafi, News18, Mahbubnagar) తక్కువ పెట్టుబడి (Low Investment)తో ఎక్కువ లాభాలు (High profits) అర్జిస్తున్నారు మహబూబ్నగర్ (Mahbunagar) జిల్లా పరిధిలోని డివిటిపల్లి గ్రామానికి చెందిన యువరైతు (Young farmer) మేకల తిరుపతయ్య డిగ్రీ పూర్తిచేసి ఆయన సాంప్రదాయ పంటల సాగుతో (Crop cultivation) పెద్దగా లాభం లేదని గుర్తించారు. ఆరేళ్లుగా కూరగాయలు సాగు (Vegetable Cultivation)పై ప్రత్యేకంగా దృష్టి సారించి వన్ 1.10. ఎకరాలను ఇందుకు కేటాయించారు. సీజన్ అనుగుణంగా టమాట (Tomoto),  బీరకాయ, బెండ (Lady Ginger), వంకాయ తదితర పంటలు సాగు చేస్తున్నారు. రసాయన ఎరువులు, పురుగుల మందులతో పెట్టుబడి భారం దానితోపాటు అప్పులు పెరగడం తప్ప పెద్దగా లాభం రాలేదని పాలేకర్ ప్రతిపాదిత గో ఆధారిత సేంద్రియ సాగు (Palekar proposed GO based organic farming) పద్ధతులను పాటిస్తున్నారు తిరుపతయ్య. పశువుల ఎరువు సస్యరక్షకు వేప నూనె  జీవామృతo వంటి వాటిని వాడుతున్నారు. కూరగాయల్లో బెండకాయకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ పంట విత్తనం కొన్నాక 45 రోజులకు కాత మొదలవుతుంది. మూడున్నర నెలల వరకు పంట చేతికి వస్తుంది. రోజుకు కనీసం 50 కిలోల పంట కోస్తున్నారు. బెండకాయను (Okra) మహబూబ్​నగర్​ జిల్లా పరిధిలో గల జడ్చర్ల భూత్పూర్ మహబూబ్​నగర్​ మార్కెట్ యార్లకు తరలిస్తున్నారు. కుటుంబ సభ్యులతోనే విక్రయిస్తుండడంతో మార్కెట్లో ఉన్న ధర దక్కుతుంది. ప్రస్తుతం కిలో బెండకాయ రూపాయలు 40 వరకు ధర లభిస్తుంది. కొన్ని హోటళ్లకు కూడా నిత్యం విక్రయిస్తున్నారు. వారికి రెండు రోజులు హైదరాబాద్​లో సేంద్రీయ కూరగాయల దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. Asara Pensions: ఇక వారికి కూడా ఆసరా పింఛన్​.. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు! ఒక్క సీజన్లో 105 రోజుల్లో కలిపి 52 క్వింటలకు పైగా పంట అమ్ముతున్నారు. సగటున రూము 30 ధర వచ్చినా రూ  1.57 లక్షలు అర్జిస్తున్నారు. రెండు సీజన్లు కలిపి ఒక్క బెండకాయ సాగుతూనే రూ 3.15 లక్షలకు పైగా వస్తుంది. ఖర్చు పోగా రూ 3 లక్షలు మిగులుతున్నాయని మిగతా కూరగాయలతో మరో రూ లక్ష వరకు ఆదాయం వస్తుందని వరి ఇతర పంటలు సాగు చేస్తున్న కూరగాయలకి ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన అన్నారు. ఖర్చు ఏమంత ఎక్కువ ఉండదు: మేకల తిరుపతయ్య  పురుగు మందులు పిచికారి చేశాక కూరగాయల తోటలో చిరుగా లేనంత ఘోరంగా వాసన వస్తుంది. వాటిని ఎలా తింటాం. అందుకే పాలేకర్ గో ఆధారిత సేంద్రీయ పద్ధతితో సాగు చేస్తున్నాను. ట్రాక్టర్​, ఎద్దులు ఉన్నాయి.. రూ. 500 డీజిల్ సరిపోతుంది మొక్కల మధ్య మూడు అడుగుల దూరం ఉండేలా చూశా. విత్తనాలు తక్కువ అవసరం కావడంతో రు 4 వేలు హెచ్చించా. మరో రూ 6 వేల తో వేప నూనె జీవ మూత్రం యాలకుల రసంతో సస్యక్రక్షణ చేపట్టాను. సీజన్లో 10,000 ఇలా రెండుసార్లకు కలిపి  20 వేలకు మించి ఖర్చు రాదని ఆయన అన్నారు
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Agriculture, Cultivation, Mahbubnagar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు