డేవిడ్ రాజు హత్య కేసులో కేఏ పాల్‌కు అరెస్ట్ వారెంట్

విచారణ కోసం కోర్టుకు హాజరవ్వాల్సిందిగా పాల్‌కు పలు మార్లు నోటీసులు పంపింది కోర్టు. ఐనా ఆయన స్పందించకపోవడంతో ఈసారి అరెస్ట్ వారెంట్ జారీచేసింది.

news18-telugu
Updated: August 19, 2019, 2:52 PM IST
డేవిడ్ రాజు హత్య కేసులో కేఏ పాల్‌కు అరెస్ట్ వారెంట్
కే ఏ పాల్ (File)
news18-telugu
Updated: August 19, 2019, 2:52 PM IST
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌కు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. సోదరుడు డేవిడ్ రాజు హత్య కేసులో మహబూబ్ నగర్ జిల్లా కోర్టు ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. డేవిడ్ రాజు హత్య కేసులో తొమ్మిదో నిందితుడిగా ఉన్నారు కేఏ పాల్. ఐతే విచారణకు కేఏ పాల్ హాజరుకాకపోవడంతో కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేసింది. కాగా, కేఏ పాల్ తమ్ముడు డేవిడ్ రాజు 2010 ఫిబ్రవరిలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మహబూబ్‌నగర్ జిల్లా కొమ్మిరెడ్డిపల్లి వద్ద రోడ్డుపై ఆగిఉన్న కారులో డేవిడ్ రాజు మృతదేహం లభ్యమైంది. కారు ముందు సీట్లో డేవిడ్ రాజు శవం పడి ఉంది.

మొదట దాన్ని గుర్తు తెలియని శవంగా భావించిన పోలీసులు.. అనంతరం కేఏ పాల్ సోదరుడు డేవిడ్ రాజుగా గుర్తించారు. ఆ తర్వాత అతను డేవిడ్ రాజు అని గుర్తించారు. డేవిడ్ రాజుకు, కెఎ పాల్‌కు మధ్య ఆస్తి తగాదాలున్నాయి. ఆస్తి తగాదాల కారణంగానే డేవిడ్ రాజును కేఏ పాల్ హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. విచారణ కోసం కోర్టుకు హాజరవ్వాల్సిందిగా పాల్‌కు పలు మార్లు నోటీసులు పంపింది కోర్టు. ఐనా ఆయన స్పందించకపోవడంతో ఈసారి అరెస్ట్ వారెంట్ జారీచేసింది.

First published: August 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...