హోమ్ /వార్తలు /తెలంగాణ /

Crime News: రూ.25 కోట్ల రుణం పేరుతో రూ.25 లక్షలు స్వాహా..నిందితుడు అరెస్ట్

Crime News: రూ.25 కోట్ల రుణం పేరుతో రూ.25 లక్షలు స్వాహా..నిందితుడు అరెస్ట్

వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

లోన్ ఇప్పిస్తానని మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును వనపర్తి పోలీసులు రట్టు చేశారు.  పెద్ద ఎత్తున లోని ఇప్పిస్తామని 25 లక్షలు కాజేసి మోసం చేసి తిరుగుతున్న నిందితుడు శివ నాయుడు అలియాస్ పొదిలి సుధాకర్ ను వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో దాబా వద్ద పట్టుకున్నట్లు సిసిఎస్ ఎస్ఐ హృషికేష్ తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Mahabubabad, India

లోన్ ఇప్పిస్తానని మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును వనపర్తి పోలీసులు రట్టు చేశారు.  పెద్ద ఎత్తున లోని ఇప్పిస్తామని 25 లక్షలు కాజేసి మోసం చేసి తిరుగుతున్న నిందితుడు శివ నాయుడు అలియాస్ పొదిలి సుధాకర్ ను వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో దాబా వద్ద పట్టుకున్నట్లు సిసిఎస్ ఎస్ఐ హృషికేష్ తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Breaking News: ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం..ఏడుగురు కార్మికులు దుర్మరణం

వనపర్తి ఐసర్ షోరూమ్ కు చెందిన సోహెల్ కు 25 కోట్ల రుణాన్ని ఇప్పిస్తామని ముందుగా 25 లక్షలు ఇవ్వాలని తీసుకున్నట్లు తెలిపారు. 25 లక్షల రూపాయలు తీసుకున్న తర్వాత రుణం ఇప్పుడు అప్పుడు అంటూ జాప్యం చేయడంతో అనుమానం కలిగిన సోహెల్ వనపర్తి పోలీస్స్టేషన్ లో ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. నిందితుని కోసం గాలిస్తుండగా పెబ్బేర్ లోని ఒక డాబాలో అదుపులోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు. దీనిపై కూపీ లాగగా గుంటూరుకు చెందిన బర్కతుల్లా అనే వ్యక్తి ట్రాక్టర్లు బేరింగ్లు సప్లై చేసే వారని, అతను రాజు వర ప్రసాద్ లను పరిచయం చేయగా వీరు శివ నాయుడు అలియాస్ పొదిలి సుధాకర్ లను పరిచయం చేశారని, వారు బెంగుళూరులోని ఏఎంపి  క్యాపిటల్ ఇండియాలో లోన్ ఇప్పిస్తామని బెంగళూరుకు తీసుకెళ్లాడు. అక్కడ అజిత్ పురుషోత్తం, వినోద్ కుమార్ రాజశేఖర్, నాగరాజులను పరిచయం చేసి అతన్ని నమ్మించి 25 కోట్ల లోనుకు గాను 25 లక్షలు డిపాజిట్ చేయవలసిందిగా చెప్పి అతని నుండి 25 లక్షలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆ తర్వాత ఐదు లక్షలు ఖర్చులు కోసమని తీసుకోగా కాళీ చెక్కు, డాక్యుమెంట్లు తీసుకొని వెళ్ళినట్లు చెప్పారు.

Crime News: హైదరాబాద్ లో వ్యక్తి దారుణ హత్య..పట్టపగలే కత్తులతో..

అనంతరం వారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో అనుమానం కలిగిన సోహెల్ వనపర్తి టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితుడు పొదిలి సుధాకర్ అలియాస్ శివా నాయుడును అదుపులోకి తీసుకున్న తర్వాత విచారించగా నేరాన్ని ఒప్పుకున్నట్లు వారు తెలిపారు. అంతకుముందు గుప్త నిధులు,  తక్కువ ధరకే బంగారు ఇస్తామని అనేక మోసాల్లో వీరు పాల్గొన్నట్లు నిందితులు ఒప్పుకున్నాడని, మిగిలిన నిందితులను కూడా అరెస్టు చేసి కోర్టుకు అప్పగిస్తామని ఆయన తెలిపారు.

ఈ కేసులో సిసిఎస్ ఎస్ఐ రుషికేష్, వనపర్తి పట్టణ ఎస్ఐ యుగంధర్ రెడ్డి, ఏఎస్ఐ ఏ భాష,  సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్లు శ్రీనివాస్, తిరుపతిరెడ్డి, సమరసింహారెడ్డి, ఐటీ కోర్ కానిస్టేబుల్ మురళి, పోలీస్ సిబ్బంది కృషి చేసినట్లు తెలిపారు.

First published:

Tags: Crime, Crime news, Mahabubnagar, Telangana

ఉత్తమ కథలు