హోమ్ /వార్తలు /తెలంగాణ /

Conocarpus : ఈ చెట్టు.. మీ దగ్గర్లో ఉందా.. ఐతే జాగ్రత్త!

Conocarpus : ఈ చెట్టు.. మీ దగ్గర్లో ఉందా.. ఐతే జాగ్రత్త!

డేంజర్ ట్రీ.. జాగ్రత్త

డేంజర్ ట్రీ.. జాగ్రత్త

దీనిపై పరిశోధనలు జరిపిన పాకిస్తాన్, ఇరాన్ వంటి దేశాలు ఈ మొక్కలను నిషేధించాయి. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం మొక్కల నుంచి తప్పించింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Mahbubnagar (Mahabubnagar), India

  Syed Rafi, News18,Mahabubnagar

  ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లావ్యాప్తంగా పలు పట్టణాలు, గ్రామాల్లో సుందరీకరణ కోసం నాటిన మొక్కలు పర్యావరణ ప్రేమికుల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. పచ్చదనం పెంచే కార్యక్రమం హరితహారంలో భాగంగా నాటిన మొక్కల్లో కోనో కార్పస్ అనే మొక్క కొంతకాలంగా కీలకమైంది. పట్టణాల్లోని ప్రధాన కూడలిలో డివైడర్లు ముఖ్య ప్రాంతాలతో పాటు గ్రామాల్లో విరివిగా వీటిని నాటడంతో మొక్కలు కాస్త వృక్షాలుగా ఎదిగాయి.

  Read Also :  వామ్మో నాలుగేళ్లకే గుండెపోటు.. లక్షణాలు ఇవే..! ఈ జాగ్రత్తలు మస్ట్

  ఏటా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ జనవరి నెలల్లో గుత్తులుగా పూలు పూస్తాయి. వీటినుంచి మంచి వాసన వ్యాపిస్తుంది. మంచు, చలితో పాటు తేమ వాతావరణంలో ఆ సువాసన దట్టంగా పరిసరాల్లో పరుచుకుంటుంది. అదే సమయంలో పూల నుంచి జాలువారి పుష్పొడి శ్వాసకోశాల్లోకి చొరబడి పలు రుగ్మతలకు కారణమవుతుందని వైద్య అధ్యయనాల్లో తేలింది. మనుషుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావంతో పాటు పర్యావరణానికి హాని తల పెడుతుందని వృక్ష శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

  ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతూ రూ.లక్షల్లో నష్టం కలిగించే ఈ మొక్కలను ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు పట్టణాలు రోడ్ల మధ్య సుందరీకరణ కోసం పెంచుతున్నారు. నిటారుగా ఏపుగా పెరిగి నిత్యం పచ్చదనంతో కలకలలాడే ఈ చెట్టు పరిసరాల్లోని చిన్నచిన్న జీవరాశులన్నీ అంతం చేస్తుందని గుర్తించారు. వారాల వ్యవధిలోనే వృద్ధి చెందే కోనోకార్పస్ మొక్కల్లో పలు ఉపజాతులు ఉన్నాయి.

  ప్రపంచవ్యాప్తంగా ఉష్ణ మండలాల్లో తీర ప్రాంతాల్లోని అడవుల్లో ఇవి పెరుగుతాయి. వీటిని మంగ్ గ్రూప్ జాతి మొక్కలు అంటారు. తక్కువ కాలంలో ఏవుగా పెరగడం వేర్లు భూగర్భంలోకి పాతుకుపోవడంతో ఇది ప్రతి ఋతువుల్లోనూ పచ్చదనంతో మెరుస్తుంది. ఈ గుణమే దీనిని అన్ని దేశాలకు విస్తరించేలా చేసింది. ఆఫ్రికా ఆసియా ఖండాలతోపాటు మహానగరాల్లో సుందరీకరణకు వినియోగిస్తున్నారు. రోడ్లకు ఇరువైపులా మధ్యలో నాటడం వల్ల పరిసరాలు పచ్చదనంతో నిండుతాయి. వారాల వ్యవధిలోనే ఏపుగా పెరుగుతుండటంతో అంతటా ఈ మొక్కలకు ప్రాధాన్యత లభించింది. అన్ని పట్టణాల్లో వీటిని నాటడం మొదలుపెట్టారు.

  కొనో కార్ఫరస్ పుష్పాల నుంచి వెలువడే పొడితో అలర్జీ శ్వాసకోశ ఆస్తమా సమస్యలు వస్తున్నాయని వృక్ష వైద్య శాస్త్రవేత్తల పరిశోధన ద్వారా తేల్చారు. ఈ మొక్కతో పక్షులు ఇతర కీటకాలకు కూడా ఉపయోగ లేదని వెల్లడించారు. ముఖ్యంగా సీతకోక చిలుకలు ఈ వృక్షాలను ఆశించవు. పక్షులు.. గూళ్ళు కట్టవు. ఏ జంతువులు వీటిని ఆకులను తినవు. మరోవైపు వీటిని పట్టణాల్లో గ్రామాల్లో నడి మధ్యలో పెంచడంతో వేర్లు లోతుకు చొచ్చుకొని పోయి మధ్యలో అడ్డు వచ్చే నీటి పైపులు, ఇతర ప్రసారాల తీగలు మురుగు కాలువల కట్టడాలని బీటలు వారేలా చేస్తున్నాయని గుర్తించారు.

  దీనిపై పరిశోధనలు జరిపిన పాకిస్తాన్, ఇరాన్ వంటి దేశాలు ఈ మొక్కలను నిషేధించాయి. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం మొక్కల నుంచి తప్పించింది. నర్సరీలో ఈ మొక్కలను పెంచరాదని అన్ని జిల్లాల డీఆర్డీఓ విభాగాలను ఆదేశించింది. అయితే క్షేత్రస్థాయిలో ఈ ఆదేశాలు సరిగా అమలు కాకపోవడం లేదని తెలుస్తుంది.

  Published by:V. Parameshawara Chary
  First published:

  Tags: Mahabubnagar, Telangana

  ఉత్తమ కథలు