Bullet Bandi Song: బుల్లెట్ బండి పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన టీఆర్ఎస్ ఎంపీ కవిత.. వీడియో వైరల్

బుల్లెట్ బండి సాంగ్‌కు ఎంపీ మాలోత్ కవిత స్టెప్పులు

Bullet Bandi song: సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న బుల్లెట్ బండి సాంగ్‌ (Bullet Bandi Song)కు తాజాగా టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత (Maloth Kavitha) కూడా డ్యాన్స్ చేశారు. ఓ పెళ్లికి హజరై వధూవరులతో కలిసి స్టెప్పులేశారు. ప్రస్తుతం ఆ వీడియో కూడా వైరల్‌గా మారింది.

 • Share this:
  'నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా.. డుగు డుగు డుగు డుగు డుగు డుగని..''  ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల్లో బుల్లెట్ పాట మోత మోగిస్తోంది. అంతేకాదు ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, జోష్, మోజ్, టకాటక్, ఎంఎక్స్ వంటి షార్ట్ వీడియో అప్లికేషన్స్‌లోనూ దుమ్ము రేపుతోంది. లక్షలాది మంది ఈ పాటకు స్టెప్పులేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. ఇక యూబ్యూట్‌లోనూ బుల్లెట్ పాట రికార్డులు సృష్టిస్తోంది. కోట్లాది వ్యూస్‌తో ట్రెండింగ్‌లో ఉంది. ఇటీవల ఓ పెళ్లి కూతురు, ఆస్పత్రిలో నర్సు.. బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్ చేయడం.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత కూడా ఈ జానపదానికి అదిరిపోయే స్టెప్పులేశారు.

  ఎంపీ మాలోత్ కవిత మంగళవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఓ పెళ్లికి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించిన తర్వాత.. బుల్లెట్ బండి పాటకు స్టెప్పులేశారు. వధూవరులతో పాటు ఎంపీ కవిత కూడా డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  Karimnagar : ఆడపిల్ల పెళ్లి కోసం... ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్ చేయూత.. కట్నాలు,కానుకలతో ఘనంగా పెళ్లి

  కొన్ని రోజులు క్రితం మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ పెళ్లి కూతురు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాను ఊపేసిన విషయం తెలిసిందే. మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన అటవీ శాఖ ఉద్యోగి ఎఫ్‌ఎస్‌ఓ రాము, సురేఖ దంపతుల పెద్ద కుమార్తె.. సాయి శ్రీయను రామకృష్ణాపూర్‌కు చెందిన ఆకుల అశోక్‌తో ఈనెల 14న పెళ్లి చేశారు. అయితే అప్పగింతల సమయంలో సాయిశ్రీయ చేసిన డ్యాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. యూట్యూబ్‌లో ఈ వీడియోను 50 లక్షల మందికి పైగా వీక్షించారు.  TS news : బిచ్చగత్తె... దానకర్తగా మారింది. కారణం తెలిస్తే.. షాకే మరి..!

  ఆ తర్వాత ఓ నర్సు కూడా ఇదే పాటకు స్టెప్పులేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి పీహెచ్‌సీలో పనిచేస్తున్న నర్సు బుల్లెట్ పాటకు డాన్స్ చేసి ఆకట్టుకుంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున వేడుకలు ముగిసిన తర్వాత.. ఆస్పత్రిలోని నర్సులంతా కలిసి సందడి చేశారు.   వారిలో ఒక నర్సు డాన్స్ చేస్తుండగా.. మిగతా వారు చప్పట్ల కొట్టి ఎంకరైజ్ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. పెళ్లి కూతురు వీడియోలా ఇది కూడా వైరల్‌ అయింది. ఐతే ఈ ఘటనపై  జిల్లా కలెక్టర్  విచారణకు ఆదేశించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.


  కాగా, బుల్లెట్ బండి పాటను తెలంగాణలోని పాలమూరు జిల్లాకు చెందిన లక్ష్మణ్ రాశారు. ఆ పాటకు సింగర్ మోహన భోగరాజు పాడడతంతో పాటు డాన్స్ చేసి ప్రైవేట్ ఆల్బమ్ విడుదల చేశారు. అయితే ఆమె ఒరిజినల్‌గా పాడిన పాటకు బాగానే  ప్రాచుర్యం లభించినప్పటికీ... కొద్ది రోజుల తర్వాత మంచిర్యాల పెళ్లి కూతురు సాయిశ్రీ తన పెళ్లిలో భర్త ముందు చేయడంతో మరింతగా వైరల్ అయింది. ఆ తర్వాత ఒరిజినల్ సాంగ్‌ను చూసే వారి సంఖ్య కూడా బాగా పెరిగింది. అందుకే య్యూటూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి.
  Published by:Shiva Kumar Addula
  First published: