Mahabubabad : కమీషన్లు తీసుకుని ఇంట్లోనే ఉంటున్నారా..? అధికారులపై ఎమ్మెల్యే శంకర్ నాయక్

అధికారులు కమీషన్లు తీసుకుని ఇంట్లోనే ఉంటున్నారా..? ఎమ్మెల్యే శంకర్ నాయక్

Mahabubabad : గత కొద్ది రోజుల క్రితం అధికార పార్టీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అధికారులపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే..ఏకంగా విషయం సీఎం కేసిఆర్‌కు చేరడంతో సమస్య సద్దుమణిగింది. సీఎం ఆయన్ను మందలించి విషయాన్ని సర్దుబాటు చేశారు..అయితే తాజాగా మరోసారి శంకర్ నాయక్ వార్తల్లోకి ఎక్కారు...అయితే ఈసారి మాత్రం ఓ మంచిపని కోసమే..

  • Share this:
సాధరణంగా అభివృధ్ది పనుల నాణ్యతపై విపక్షాలు ఎక్కువగా ఆందోళణ చేస్తాయి...ప్రభుత్వం చేపట్టిన పనుల్లో నాణ్యత లోపాలు ప్రశ్నిస్తూ అధికార పార్టీపై విమర్శలు చేస్తారు..మరోవైపు అధికారులను సైతం వారు నిలదీస్తారు. కాని తాజాగా అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రతిపక్ష ఎమ్మెల్యెగా మారాడు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్న నాణ్యత లోపాలను ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎత్తి చూపారు..కోట్లాది రూపాయల పరిశీలించకుండా ఇరిగేషన్‌ అధికారులు ఇంట్లో పడుకుంటున్నారా అంటూ అధికారులను ప్రశ్నించారు.

మహబూబాబాద్‌ జిల్లా గూడూరు సమీప పాకాలవాగుపై నిర్మిస్తున్న చెక్‌ డ్యాం పనులను బుధవారం ఎమ్మెల్యే పరిశీలించారు. అంతకుముందు వడ్డెరగూడెం సమీపంలోని చెక్‌ డ్యాం నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఒక్కసారిగా ఖంగుతిన్నారు. చెక్‌డ్యాం పనులు చూసిన అనంతరం ఇవేం పనులు.. అంటూ ఇరిగేషన్‌ డీఈ ఉపేందర్, ఏఈలు నిహారిక, శేఖర్‌ను పిలిచి ఆరా తీశారు. 'అసలు మీరేం చేస్తున్నారు? మొత్తం మట్టి కనిపిస్తుంది. సిమెంట్‌తో కడుతున్నారా.. మట్టితోనా.. అని ప్రశ్నించారు. మీరు అసలు పనుల వద్దకు వస్తున్నారా.. కమీషన్లు తీసుకొని ఇంటి వద్దనే ఉంటున్నారా' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో అక్కడే ఉన్న డీఈ ఉపేందర్‌ కలగచేసుకుని ఇంతకాలం మరో డీఈ ఉండేవారని, తాను కొత్తగా వచ్చినట్లు చెప్పగా ఏఈలపై ఆగ్రహం చేశారు. మరో రెండు వారాల్లో డ్యాం చుట్టూ కట్టే రాతి కట్టడాలలో సిమెంట్‌ నింపి కట్టాలని, ఇలా మట్టితో కాదని సూచించారు. మళ్లీ వచ్చి చూసే వరకు నాణ్యత లేకుంటే బిల్లులు ఆపిస్తానని హెచ్ఛరించారు. దీంతో అధికారుల ఆశ్చర్యానికి లోనయ్యారు.ఎమ్మెల్యే తీరు వారి గుండెల్లో రైళ్లను పరుగెత్తించింది. కమీషన్లు తీసుకుని పనులు చేస్తున్నారా..అనే వ్యాఖ్యలు అధికార పార్టీని కొంత ఇరుకున పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి...
Published by:yveerash yveerash
First published: