(P.Srinivas,New18,Karimnagar)
కారులో తిరగాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. కానీ వాటిని కొనే స్తోమత కొంతమందికి మాత్రమే ఉంటుంది. మరి కొంతమంది కలలు కలలుగానే మిగిలిపోతున్నాయి. మహబూబాబాద్(Mahbubabad)లోని యూపీఎస్ పాఠశాల(UPS School)లో 4వ తరగతి చదువుతోన్న నవీన్(Naveen)కి కూడా కారు నడపాలని కోరిక. కానీ అతడి కుటుంబానికి కారు(Car) కొనే ఆర్థిక స్థోమత లేదు. పైగా అతడిది కారు నడిపే వయసు కాదు. కానీ కారు నడపాలనే తన కోరికను తీర్చుకోవడానికి నవీన్ వినూత్నంగా ఆలోచించాడు.
ఒక్క ఐడియాతో కోరిక తీరిపోయింది...
ఉపాయం ఉంటే ఎంతటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు అంటారు కదా.. నవీన్ అదే చేశాడు. తను రోజు నడిపే సైకిల్ కు హ్యాండిల్ తీసేసి దాని స్థానంలో కారు స్టీరింగ్ అమర్చి ఎంచక్కా 'సైకిల్ కారు' తొక్కుకుంటూ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. సైకిల్ తొక్కుతూ కార్లతో పోటీ పడుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు నవీన్ సైకిల్ తొక్కుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నవీన్ క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 4వ తరగతిలోనే సైకిల్ ను కారులాగా నడుపుతున్నాడంటే పెద్దయ్యాక ఇంకా ఎన్ని కనిపెడుతాడో అంటూ సోషల్ మీడియాలో సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
తెలివి తేటలు ఎవరి సొత్తు కాదు..
పిల్లోడికి రానున్న రోజుల్లో చాల మంచి భవిష్యత్తు ఉందని నెటిజన్స్ అంటున్నారు.గతం లో కూడా ఇలానే వరంగల్ జిల్లాకు చెందిన 8వ తరగతి విద్యార్థి శ్రేయంక్వి అనే వీద్యార్థి సైకిల్ సైకిల్ కి కార్ డోర్స్ అలాగే పైన టాప్ ను తీసుకోని సైకిల్ కి అమర్చి క విధుల్లో ఎంచక్కా సైకిల్ తో చెక్కర్లు కొట్టాడు. ఇది చుసిన జనాలు అబ్బయి తెలివితేటలకు మురిసిపోయారు. టాలెంట్ ఎవరి సొత్తు కాదని మెదడుకు పదును పెడితే ఏదైనా సాధించవచ్చని ఈ పిల్లలు నిరూపిస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా మరిన్ని ప్రయోగాలు చేసి సక్సెస్ కావాలని అందరూ కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mahabubabad, Telangana News