హోమ్ /వార్తలు /తెలంగాణ /

Maha Shivratri 2022: వేములవాడ రాజన్న జాతరకు పోదామా.. శివరాత్రి జాగరణ విశిష్టత తెలుసా?

Maha Shivratri 2022: వేములవాడ రాజన్న జాతరకు పోదామా.. శివరాత్రి జాగరణ విశిష్టత తెలుసా?

వేములవాడలో శివరాత్రి వేడుక

వేములవాడలో శివరాత్రి వేడుక

మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్ర కరణ్ రెడ్డి, గంగుల కమలాకర్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

(P.Srinivas,News18,Karimnagar)

శివం ' అంటే శుభం . శుభాలను ఇచ్చేవాడు శివుడు ఆ దేవదేవుని ' లింగోద్భవ ఆవిర్భావ కాలమే మహాశివరాత్రి . ఈ రోజున భక్తు లు ఎంతో నిష్టతో స్వామి వారిని కొలుస్తారు . కఠిన ఉపవాసంతో ముక్కంటిని ఆరాధిస్తారు. నేడు(మంగళవారం) జరిగే మహాశివరాత్రి వేడుకలకు నాలుగు జిల్లాలలోని శివాల యాలు ముస్తాబైనాయి. దక్షణకాశీగా ప్రసిద్దిగాంచిన వేములవాడలో సోమవారం నుంచి వేడుకలు ప్రారంభ మైనాయి.

మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున మంగళవారం శ్రీ రాజరాజేశ్వర స్వామికి పట్టు వస్త్రాలను సమర్పించింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి , మంత్రులు గంగుల కమలాకర్ , కొప్పుల ఈశ్వర్ వేములవాడ ఆలయంలో పట్టువస్త్రాలను సమర్పించారు. అలాగే, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అక్కడి ఆలయ అధికారులు కూడా రాజన్నకు పట్టు వస్త్రాలు అందజేశారు.

మహాశివరాత్రి చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం కృష్ణ పక్ష చతుర్దశి రోజున వస్తుంది. హిందువుల పండుగలలో మహాశివ రాత్రి ప్రశస్తమైనది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. చాంద్రమాన నెల లెక్క ప్రకారం, ఈ రోజు గ్రెగేరియన్ క్యాలెండర్లో ఫిబ్ర వరి లేదా మార్చి నెలలో వస్తుంది.

Kadapa: కామంతో కళ్లుమూసుకుపోయిన తల్లి.. ప్రియుడితో కలిసి కన్నకూతుర్ని ఏం చేసిందంటే..


సంవ త్సరంలో పన్నెండు శివరాత్రులలో మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది శివ , పార్వతుల వివాహం జరిగిన రోజు కూడా. ఒకనాడు కైలాసపర్వత శిఖరంపై పార్వతీపరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా.. అన్ని వ్రతాల్లో ఉత్తమమైన భక్తి ముక్తి ప్రదాయకమైనది ఏదని శివుణ్ని పార్వతి కోరగా, అప్పుడు శివుడు శివరాత్రి వ్రత మనుదాని విశేషాలను తెలియజేస్తాడు.


ఇక శివరాత్రి జాగరణ విశిష్టతల విషయానికొస్తే.. జాగారం లేదా జాగరణ చేయడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. నోములు అనేవి మానవుడికి సంస్కారాన్ని కలిగించి ఆరోగ్యవంతమైన జీవన విధానానికి తోడ్పడతాయని చెబుతారు. మెచ్చి వరాలిచ్చే భోళాశంకరుడిగా ప్రజల విశ్వాసం పొందిన జ్యోతిర్లింగ స్వరూన్ని పేదల పాలిట పరమదైవంగా భావిస్తారు. శివ పూజకు ఆర్భాటం అవసరం లేదు. గరళం మింగి ప్రాణకోటిని రక్షించిన కరుణా సము ద్రుడు కాబట్టే ఆయనకు ప్రీతిపాత్రమైన భస్మ , గంగాజలం , ఆవుపాలు , మారేడు దళాలు , తుమ్మిపూలతో శిరాత్రినాడు పూజలు చేస్తే సకల దరిద్రాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు.

First published:

Tags: Karimnagar, Maha Shivratri, Vemulawada

ఉత్తమ కథలు