Home /News /telangana /

MADHYA PRADESH CM SHIVRAJ SINGH CHOUHAN CRITICIZED TELANGANA CM KCR AT A BJP MEETING IN HYDERABAD PRV

Telangana: "కడుపులో నుంచి అన్నీ కక్కిస్తాం కేసీఆర్..​ బీజేపీ అంటే బిర్యానీ అనుకున్నావా" : మధ్యప్రదేశ్​​ సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్​

శివరాజ్​ సింగ్​ చౌహాన్​ (ఫైల్​)

శివరాజ్​ సింగ్​ చౌహాన్​ (ఫైల్​)

తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని ఆయన అభినందించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ హాజరై మాట్లాడారు.

    బీజేపీ (BJP) బెదిరింపులకు బయపడేపార్టీ కాదని, కేసీఆర్​కు కలలో కూడా బండి సంజయ్​ గుర్తొస్తున్నారని  మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ (Madhya Pradesh CM Shivraj Singh Chouhan) అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana CM KCR) పిరికివాడని.. ఇలాంటి సీఎంను తానెక్కడా చూడలేదని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని చౌహాన్ అభినందించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి  మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విపక్షాలు (Oppositions) లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి కనిపించడం లేదని చౌహాన్​ పేర్కొన్నారు. ఉద్యమిస్తే భయపడి అక్రమంగా, దౌర్జన్యంగా అరెస్టు చేసి జైల్లో వేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ చేస్తున్న పోరాటానికి మద్దతివ్వడానికే తెలంగాణ గడ్డపైకి వచ్చినట్లు చెప్పారు.

    కడుపులో నుంచి అన్నీ కక్కిస్తాం..

    శివరాజ్​ సింగ్​ చౌహాన్​ మాట్లాడుతూ.. ‘ మీ బెదిరింపులకు భయపడే పార్టీ కాదు బీజేపీ. కేసీఆర్‌కు కలలో కూడా బండి సంజయ్‌ (Bandi sanjay) గుర్తొస్తున్నారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోంది. కేసీఆర్ నేను కూడా  ముఖ్యమంత్రినే. నువ్వు రెండోసారి ముఖ్యమంత్రి కావొచ్చు... నేను నాలుగోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నా. మీలాగా సంస్కార హీనంగా వ్యవహరించడం లేదు. బీజేపీ అంటే బిర్యానీ అనుకున్నారా? కడుపులో నుంచి అన్నీ కక్కిస్తాం..

    డబుల్ బెడ్‌ రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి, కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమైంది? వీటికి జవాబు ఎందుకు ఇవ్వడం లేదు? తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణలో ధర్మయుద్దం మొదలైంది. అవినీతి-నియంత-కుటుంబ పాలనను అంతం చేసేందుకు సంజయ్ చేస్తున్న పోరాటం అభినందనీయం. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుంది. తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడుతుంది’’ అని శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ తెలిపారు.

    విశ్రమించేది లేదు..

    ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ మాట్లాడుతూ..  టీఆర్​ఎస్​ ప్రభుత్వం అవినీతి, నియంతృత్వ పాలనను తరిమికొట్టే వరకు విశ్రమించేది లేదని  తెలిపారు. ఎల్లుండి అస్సాం సీఎం వరంగల్‌ వస్తున్నారని.. 317జీవో సవరణ పోరాటంలో పాల్గొంటారని వెల్లడించారు.

    ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని లక్ష్మణ్​ తెలిపారు. ఇక తెలంగాణ  మంత్రి కేటీఆర్ (Minister KTR) భారతీయ జనతా పార్టీ నాయకులపై దిగజారి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాషాయ జెండా ఎగరడం ఖాయమని లక్ష్మణ్‌ ధీమా వ్యక్తం చేశారు

    అరెస్టుల వల్ల బీజేపీ కార్యకర్తలు (BJP leaders) భయపడరనే విషయాన్ని గ్రహించాలన్నారు. రాజకీయ పోరాటం కొనసాగిస్తామని చెప్పడానికే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ హైదరాబాద్‌ వచ్చినట్లు చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లక్ష్మణ్‌ మాట్లాడారు. .
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Bjp, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు