Home /News /telangana /

MADHUCA TREE CHANGES INTO TWO COLORS IN ADILABAD FOREST VB ADB

One tree two colors: ప్రకృతి మాయ.. ఒకే చెట్టుకు రెండు రంగులు.. చూపరులను ఆకర్షిస్తున్న ఇప్పచెట్టు..

ఇప్పచెట్టు

ఇప్పచెట్టు

One tree two colors: ప్రకృతిలో కొన్ని చెట్లు ప్రత్యేకతలను కలిగి ఉంటాయి. అటువంటి చెట్లల్లో ఓ చెట్టుకు ఒకవైపు ఆకు పచ్చగాను.. మరోవైపు ఎర్రటి రంగులో కనిపించి అకర్షిస్తోంది. రెండు రంగుల్లో కనిపించే ఈ చెట్టు ప్రకృతి చేస్తున్న మాయలో ఒకటి అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది ఎక్కడంటే..

ఇంకా చదవండి ...
    అడవి అందాలకు పెట్టింది పేరు ఆదిలాబాద్ జిల్లా. ఉమ్మది ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలోని చెట్లు ఆహ్లాదాన్ని పంచి పెడుతుంటాయి.  అయితే వేసవి వచ్చిందంటే చాలు చెట్ల ఆకులన్ని బోసిపోయి కనిపిస్తుంటాయి. కాని కొన్ని చెట్లు మాత్రం పచ్చగా, మరికొన్ని ఎరుపుగా వివిధ రంగులను పులుముకొని అందరిని ఆకట్టుకుంటాయి. అలా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం హీరాపూర్ సమీపంలోని ఇప్పచెట్టు మాత్రం ప్రతి ఏటా పూత సమయంలో రెండు రంగుల్లోకి మారుతూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పూత అయినపోయిన తర్వాత ఎప్పటిలాగే ఒకే రంగులోకి మారిపోతోంది. గత కొన్నేళ్ళుగా ఈ ఇప్పచెట్టు ఇలా రంగులు మారడాన్ని చాలా మంది గమనిస్తున్నారు. ఉట్నూరు నుండి ఆసిఫాబాద్, నార్నూర్ వెపువెళ్ళే మార్గంలో ప్రయాణికులు ఈ ఇప్పచెట్టును చూస్తు సంబరపడిపోతున్నారు. దూరం నుండి చూస్తే ఇది ఒకే చెట్టా లేక రెండు చెట్లా అన్న అనుమానం కలగకమానదు. చెట్టు దగ్గరకు వెళ్ళి మరి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కాండం ఒకటే దాని కొమ్మలు మాత్రం ఇలా రెండు రంగుల్లోకి మారడం చూసి ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు.

    ఇదిలా ఉంటే ఇప్పచెట్టుకు ఆదివాసి గిరిజనులకు అవినాభవ సంబంధం ఉంది. ఈ చెట్టును ఆదివాసులందరు తమ్ భీం దేవుడిగా భావించి పూజలు చేస్తుంటారు. వారు జరుపుకునే అన్ని పండుగల్లో, పూజా కార్యక్రమాల్లో ఇప్ప చెట్టు ఆకులు లేదా ఇప్ప పరక నూనెను నైవేద్యంగా వాడుతుంటారు. ఆదిలాబాద్ అడవుల్లో ఉండే మిగతా చెట్ల కంటే భిన్నంగా ఉండే ఈ చెట్టును కాపాడుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు. ఇప్ప పూలను పలు ఔషధాల్లో వాడతారు. అలాగే ఇప్పపువ్వులతో లడ్డూలు, పలు రకాల స్వీట్లు తయారుచేస్తుంటారు.

    ఒకే చెట్టుకు రెండు రంగులు


    ఒకే చెట్టుకు రెండు రంగులు


    ఒకే చెట్టుకు రెండు రంగులు


    ఈ ఇప్పపూలతో తయారు చేసిన లడ్డూలు తింటే రక్తహీనత సమస్య తీరిపోతుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పపువ్వులతో చేసిన లడ్డూలను పంపిణీ చేయాలని యోచిస్తోంది. రెండు రంగుల్లో కనిపించే ఈ చెట్టును చూడటానికి ఎంతోమంది ఆసక్తి చూపిస్తున్నారు. పూలు పూసే సమయంలో రంగులు మారే ఈ చెట్టుని చూడటానికి స్థానికులే కాక చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా జనాలు తరలివస్తుంటారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Adilabad, Adilabad forest, Beautiful tree, Madhuca, One tree two colors

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు