హైదరాబాద్‌లో రెచ్చిపోయిన పిచ్చికుక్కలు.. 50 మంది విద్యార్థులుకు గాయాలు

ధరమ్‌కరమ్ రోడ్డులోని ఓ స్కూల్ విద్యార్థులపై దాడి చేసి కరిచింది. పిచ్చి కుక్క దాడిలో 50 మందికి గాయాలయ్యాయయని తెలుస్తోంది.

ధరమ్‌కరమ్ రోడ్డులోని ఓ స్కూల్ విద్యార్థులపై దాడి చేసి కరిచింది. పిచ్చి కుక్క దాడిలో 50 మందికి గాయాలయ్యాయయని తెలుస్తోంది.

  • Share this:
    హైదరాబాద్‌లోని పలు కాలనీల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మంగళవారం అమీర్‌పేట్‌లో పిచ్చి కుక్క రెచ్చిపోయింది. ధరమ్‌కరమ్ రోడ్డులోని ఓ స్కూల్ విద్యార్థులపై దాడి చేసి కరిచింది. పిచ్చి కుక్క దాడిలో 50 మందికి గాయాలయ్యాయయని తెలుస్తోంది. గాయపడిన విద్యార్థులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. స్కూల్ వదిలిన తర్వాత విద్యార్ధులు బయటకు వస్తున్న సమయంలో పిచ్చి కుక్క దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. విద్యార్థులను గాయపరిచిన ఆ కుక్కను స్థానికులు కొట్టి చంపారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కుక్కల బెడదపై ఎన్నోసార్లు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదని మండిపడుతున్నారు. కనీసం ఇప్పటికైనా వీధి కుక్కల బారి నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: