Home /News /telangana /

LPG GAS PRICES HIKE IN TELANGANA SB

4 నెలల్లో రూ.120 పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

గ్యాస్ సిలిండర్స్

గ్యాస్ సిలిండర్స్

వంట గ్యాస్ ధరలు కూడా అమాంతం పెరిగిపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తన్నారు.

    ఓవైపు నిత్యవసర ధరలు మండిపోతున్నాయి. మొన్నటివరకు టమాటా, నిన్న ఉల్లిపాయలు, నేడు మిర్చి ఇలా ఏ వస్తువు చూసిన ధర సామాన్యుడి అందేలా ఉండటం లేదు. దీంతో జనం వాటిని కొనాలంటేనే భయపడుతున్నారు. ఇక దీనికి తోడు వంట గ్యాస్ ధరలు కూడా నింగినంటుతున్నాయి. దాదాపు నాలుగు నెల్లోనే HP గ్యాస్ సిలిండర్ ధర 120 రూపాయలకు చేరింది. ఆగష్టులో 14.2 కిలోల హెచ్పీ సిలిండర్ ధర రూ. 628 ఉంటే ... డిసెంబర్‌లో బుకింగ్ చేసుకున్న వాళ్లకు సిలిండర్ ధర రూ.748 రూపాయలు చూపిస్తోంది. దీంతో జనం వంట గ్యాస్ ధరలు కూడా అమాంతం పెరిగిపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తన్నారు. ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు ఇది చాలా భారమనే చెప్పాలి.

    సబ్సీడీ సిలిండర్ ధరలు ప్రాంతాల వారీగా:


    సిటీ                     డిసెంబర్            నవంబర్
    హైదరాబాద్     రూ. 748            రూ. 759.50
    ఆదిలాబాద్      రూ.748            రూ. 714
    జనగాం            రూ.863            రూ. 833
    ఖమ్మం            రూ. 728            రూ. 714
    మంచిర్యాల      రూ. 769           రూ. 754.50
    మెదక్              రూ.757.50      రూ.743
    నల్గొండ         రూ.766.50        రూ. 752
    నిర్మల్           రూ.772.50         రూ.757.50
    నిజామాబాద్   రూ.771              రూ.756.50
    సంగారెడ్డి        రూ.748              రూ.733.50
    సిద్ధిపేట్      రూ.766.50           రూ.751.50
    సూర్యాపేట్     రూ.769              రూ.754.50
    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: LPG Cylinder, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు