బలపడనున్న అల్పపీడనం... తెలంగాణకు భారీ వర్షాలు

తెలంగాణలో బుధవారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి.

news18-telugu
Updated: August 14, 2019, 7:36 AM IST
బలపడనున్న అల్పపీడనం... తెలంగాణకు భారీ వర్షాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్‌ దక్షిణ ప్రాంతం, దానిని ఆనుకుని ఉత్తర ఒడిసా ప్రాంతంల్లో కేంద్రీకృతమై ఉంది. దీంతో తెలంగాణలో బుధవారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరడంతో... అధికారులు గేట్లు ఎత్తి వరద నీటిని దిగువ ప్రాంతలకు విడుదల చేస్తున్నారు. ఏపీ తెలంగాణలోని పలు ప్రాజెక్టులన్నీ నిండుకుండగా మారాయి. దీంతో ఆయా ప్రాంతాలకు పర్యాటకులు సంఖ్య కూడా పెరిగింది.

మరోవైపుగత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దక్షిణ భారతదేశం అతలాకుతలమౌతోంది. కేరళ, కర్ణాటకలతోపాటు.. మహారాష్ట్రను కూడా వరదలు ముంచెత్తుతున్నాయి. కేరళను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. ఇప్పటికే వందల సంఖ్యలో ప్రజలు వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కేరళలో వరద బాధితులను రక్షించేందుకు ఇప్పటి వరకు అధికారులు 1332 సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు. వరసగా మరో ఐదు రోజులు వర్షం పడితే... వరదలు మరింత ఉధృతంగా పొంగి పొర్లే ప్రమాదం ఉంది.

First published: August 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>