Home /News /telangana /

LOVERS COMMIT SUICIDE DUE TO DOUBT ON PARENTS NOT ALLOW TO MARRY THEM IN KODAD SURYAPET FULL DETAILS HERE HSN

అతడికి 19 ఏళ్లు.. ఆమెకు 15 ఏళ్లు.. ఇళ్లల్లోంచి సడన్ గా మాయం.. కుటుంబ సభ్యుల్లో భయం భయం.. చివరకు చెరువులో ఇలా..

చెరువులోంచి మృతదేహాలను బయటకు తీస్తున్న పోలీసులు

చెరువులోంచి మృతదేహాలను బయటకు తీస్తున్న పోలీసులు

సూర్యాపేట జిల్లాలోని కోదాడలో లక్ష్మీపురం కాలనీకి చెందిన 19 ఏళ్ల సాయి ఐటీఐ పూర్తి చేశాడు. సాయికి అదే కాలనీకి చెందిన ఫాతిమా అనే 15 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడింది. కొద్ది కాలంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ..

ఇంకా చదవండి ...
    తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. కొంతకాలంగా ఆ యువతీ యువకుడు ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం వారి వారి ఇళ్లల్లో కూడా తెలిసింది. అయితే ఇటీవల ఇద్దరి ఇళ్లల్లోనూ జరిగిన పరిణామాలు వారిని మనస్తాపానికి గురిచేశాయి. కులాలు వేరు కావడంతో తమ ప్రేమ వివాహానికి పెద్దలు ఒప్పుకోరన్న నిర్ణయానికి ఆ యువతీ యువకుడు వచ్చారు. దీంతో ఇద్దరూ కలిసి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి మృతదేహాలు చెరువులో పైకి తేలడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట జిల్లాలోని కోదాడలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలోని కోదాడలో లక్ష్మీపురం కాలనీకి చెందిన 19 ఏళ్ల సాయి ఐటీఐ పూర్తి చేశాడు.

    సాయికి అదే కాలనీకి చెందిన ఫాతిమా అనే 15 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడింది. కొద్ది కాలంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలని కలలు కన్నారు. మంచి ఉద్యోగం తెచ్చుకుని పెళ్లి చేసుకుంటానని ఫాతిమాతో సాయి చెప్పేవాడు. అయితే వీరిద్దరి ప్రేమ గురించి వారి వారి ఇళ్లల్లో తెలిసింది. ప్రేమ వ్యవహారాన్ని పక్కన పెట్టి ముందు చదువుకోవాలనీ, లైఫ్ లో సెటిల్ అవ్వాలని పెద్దలు హెచ్చరించారు. అయితే తమ ప్రేమ వివాహానికి పెద్దలు ఒప్పుకోరని ఆ జంట భయపడింది.
    ఇది కూడా చదవండి: అర్ధరాత్రి.. రెండు గంటల సమయం.. గాఢ నిద్రలో ఉన్న తల్లిదండ్రులు.. ఆ 18 ఏళ్ల డిగ్రీ విద్యార్థిని ఏం చేసిందంటే..

    రెండు రోజుల క్రితం సాయి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఫాతిమా కూడా గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. వీరిద్దరూ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు అన్ని చోట్లా వెతికారు. అయితే శుక్రవారం వీరిద్దరి మృతదేహాలు కోదాడ చెరువులో బయటపడ్డాయి. విషయం తెలిసి కోదాడ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గురువారం రాత్రి సమయంలోనే వీరిద్దరూ ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. ఏది ఏమైనా క్షణికావేశంలో వారిద్దరూ తీసుకున్న నిర్ణయం, రెండు కుటుంబాల్లో తీవ్ర దు:ఖాన్ని మిగిల్చింది.
    అద్దెకుంటున్న భార్యాభర్తలు.. తలుపులు తీసే ఉండటంతో మాట్లాడేందుకు వెళ్తే కనిపించిన దృశ్యం చూసి ఆ యజమానికి..
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Crime news, Crime story, Hyderabad, Love affair, Love marriage, Telangana

    తదుపరి వార్తలు