Love suicide : ప్రియురాలు దక్కదని ..మనస్థాపం చెందిన ప్రేమికుడు...చివరకు...!

Love suicide : ప్రియురాలు దక్కదని ..మనస్థాపం చెందిన ప్రేమికుడు...చివరకు...!

Love suicide : ప్రేమ దక్కదని ఫీల్ అయిన యువకుడు దారుణానికి పాల్పడ్డాడు..తన ప్రేమకు తల్లిదండ్రులు అడ్డుచెప్పడంతో మనస్థాపం చెందాడు. ప్రేమించిన యువతికి దూరంగా పంపించడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

  • Share this:
ప్రేమించిన వ్యక్తి దక్కకపోతే ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో తెలిసి కూడా తల్లిదండ్రులు తమ పిల్లలపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రేమించిన వారికి అన్ని విషయాలు చెప్పి అర్థం చేసుకునేలా ఒప్పించాల్సిన తల్లిదండ్రులు తమ వ్యక్తిగత ప్రతిష్టలకు వెళ్లడంతో యువతి యువకులు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఇలా సమాజంలో రోజు ఎక్కడో ఓ చోట ఇలాంటీ దారుణాలు జరుగుతున్నా..ఇటు ప్రేమికుల్లో అటు తల్లిదండ్రుల్లో కూడా మార్పులు రావడం లేదు.తాజాగా ప్రేమించిన వ్యక్తి తన దక్కకుండా చేస్తున్న తల్లిదండ్రులను ఎదిరించలేని కామారెడ్డి జిల్లా యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమండ్ల గ్రామానికి చెందిన కర్నాల శ్రీకాంత్ చదువుకుంటున్నాడు. అయితే అదే గ్రామంలోనే ఓ యువతి ప్రేమలో పడ్డాడు.దీంతో విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసింది. ప్రేమ విషయం ఇష్టం లేని యువతి కుటుంబసభ్యులు శ్రీకాంత్‌ను గట్టిగా మందలించారు. మరోసారి యువతి జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. దీంతో శ్రీనాథ్ తల్లిదండ్రులు సైతం ఓ నిర్ణయానికి వచ్చారు. చదవు పేరుతో గ్రామంలోనే ఉంటే యువతి వెంటపడే అవకాశాలున్నాయని భావించి రెండు నెలల క్రితమే  శ్రీకాంత్ మేనత్త ఊరు అయిన సిద్దాపూర్‌కు పంపించారు. దీంతో అక్కడే ఉండి చదువుకుంటూ ప్రేమించిన అమ్మాయిని మర్చిపోతాడని భావించారు.

కాని శ్రీకాంత్ మాత్రం తన ఆలోచనను మార్చుకోలేదు. ఇక్కడే ఉంటే యువతి దక్కకపోవచ్చని మనస్థాపం చెందాడు. దీంతో చావే శరణ్యంగా భావించాడు. ఈ క్రమంలోనే ఊరి బయటకు వెళ్లి చెట్టుకు ఉరిపెట్టుకున్నాడు. అనంతరం గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Published by:yveerash yveerash
First published: