lover murder : ప్రియురాలి... మర్డర్ కమ్ సూసైడ్స్...యెస్ అంటే పెళ్లి..నో అంటే మర్డరే..

ప్రతీకాత్మక చిత్రం

lover murder : ప్రేమిస్తే..పెళ్లి చేసుకోవాల్సిందే...ఇప్పటి యువతలో ట్రెండ్ ఇదే..ఒకవేళ కాదంటే మాత్రం చావుకు సిద్దం కావాల్సిందే..ఇలా.. యెస్ అంటే నో.. మర్డర్ అంటూ కమ్ సూసైడ్ కేసులు రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్నాయి..

  • Share this:
    తాను ఇన్నాళ్లు ప్రేమించిన ప్రియురాలు పెళ్లికి నో చెప్పడంతో ఓ ప్రేమికుడు ఉన్మాదిగా మారాడు. తాను ఇన్నాళ్లుగా ప్రేమించినందుకు పెళ్లి చేసుకోవాల్సిందే అంటూ వెంటపడ్డాడు..అయితే తాను చేసేది కరెక్ట్ కాదని తెలుసుకున్న యువతి.. ఇక ప్రేమించడం కుదరదంటూ మొండికేసింది.. అంతే ..ఇది అంగీకరించని యువకుడు అది జీర్ణించుకోలేక పోవడం...ఒంటరిగా ఉన్నప్పుడు ఇంటికి వెళ్లి వారితో ఘర్షణకు దిగడం లాంటీ సంఘటనలు రాష్ట్రంలో కొకొల్లుగా కొనసాగుతున్నాయి..ఇక ఘర్షణల్లో ముందు ప్రియురాలు ప్రాణాలు.. ఆ తర్వాత తమ ప్రాణాలు బలవంతంగా తీసుకుంటున్నారు.. లేదంటే వారిపై దాడి చేసి అనంతరం తాను కూడా ఏదో ఒక ఆఘాయిత్యం చేసుకోవడం సాధారణంగా మారిపోయింది..ఇలా రోజు ఎక్కడో ఓ చోట ప్రేమ విఫలమైన యువకులు మర్డర్ చేస్తూ..ఆత్మహత్య చేసుకుంటున్నారు..

    ఈ క్రమంలోనే బోయిన్‌పల్లి పీస్ పరిధిలోని బాపూజినగర్ ‌నేడు ఇలాంటీ సంఘటన చోటు చేసుకుంది.గిరిష్ అనే యువకుడు చామంతి అనే యువతిని ప్రేమించానంటూ వెంటబడ్డాడు. అయితే ఆ యువతికి ఇష్టం లేకున్నా..ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేశాడు..అయినే ససెమీరా అనడంతో యువకుకుడు తన ఉగ్రరూపాన్ని ప్రదర్శించి ఉన్మాదిగా మారాడు.. అంటే తన ఇంటికి నేరుగా వెళ్లి ఆమెను కత్తిలో పోడిచాడు.. అనంతరం తాను కూడా అదే కత్తితో పొడుచుకున్నాడు..అయితే యువతి అరుపులు విన్న..స్థానికులు వెళ్లే సరికి ఇద్దరు రక్తపు మడుగులో పడి ఉన్నారు.. ఈ క్రమంలోనే హుటాహుటిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు..విషయం పోలీసులకు తెలియడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..దాడికి గురైన చామంతి స్థానిక సూపర్ మార్కెట్‌లో పనిచేస్తోందని స్థానికులు చెప్పారు.
    Published by:yveerash yveerash
    First published: