Home /News /telangana /

LOVE MARRIAGE COUPLE MADE COMPLAINT TO POLICE TO PROTECT FRO PARENTS VRY

Nalgonda : అమ్మాయి బీటెక్, అబ్బాయి డిగ్రీ, రహస్యంగా పెళ్లి.. ఇంట్లో తెలియడంతో..

లవ్ మ్యారేజ్ చేసుకున్న జంట

లవ్ మ్యారేజ్ చేసుకున్న జంట

Nalgonda : రహస్యంగా పెళ్లి చేసుకున్న ఓ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది. ప్రేమ పెళ్లి కుటుంబ సభ్యులకు తెలియడంతో వారిని విడదీస్తారనే భయం వారిని వెంటాడుతోంది. దీంతో ఆ జంట స్థానిక పోలీసులకు ఆశ్రయించింది.

    కులాలు వేరైనా ఉన్నత చదువులు చదువుకున్నారు.. ఈ క్రమంలోనే ఒకరినొకరు ఇష్టపడ్డారు. అయితే వారి కులాలు వేరు కావడంతో తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోరనే అభిప్రాయానికి వచ్చారు. వారికి తాము ప్రేమించుకుంటున్నామని తెలిసినా ప్రమాదమే అని గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులకు తెలియకుండా గత డిశంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. ఎవరింటికి వారు వెళ్లిపోయారు.. ఉద్యోగాలు చూసుకుని సెటిల్ అయిన తర్వాత ఇంట్లో చెబుతామని భావించారు. ఈ క్రమంలోనే ఎవరింట్లో వారు ఉంటూనే ఉద్యోగ వేటలో పడ్డారు. అయితే ఇంతలో వారి ప్లాన్ రివర్స్ కావడంతో పోలీసులను ఆశ్రయించారు.

    వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా మిర్యాల గూ మండలం తడకమళ్ల గ్రామానికి చెందిన తురక సందీప్ , అమరావతి ప్రియాంకలు చిన్నప్పటి నుండే స్నేహితులు, కలిసి చదువుకున్నారు. అది కాస్త ప్రేమగా మారింది. ప్రియాంక బీటెక్ పూర్తి చేయగా.. సందీప్ డిగ్రీ పూర్తి చేశాడు. కాగా ఇద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లికి వారింట్లో ఒప్పుకునేందుకు నిరాకరిస్తారనే అనుమానాలు వారిలో రేకెత్తాయి.. అయినా వారితో చర్చించారు. అనుకున్నట్టుగా కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో గత డిశంబర్ 20న నగరంలోని ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసకున్నారు. అనంతరం తమకు సంబంధం లేదన్నట్టుగా ఎవరింటి వారు వెళ్లారు. అయితే పెళ్లైనా నెల రోజుల్లోనే వారి వివాహ విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో ఇరు కటుంబాల సభ్యులు రంగంలోకి దిగారు.. పెళ్లిని నిరాకరించారు. ఇద్దరిని విడదీసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో ఆందోళన చెందిన ఆ జంట పోలీసులకు ఆశ్రయించారు. తమను విడదీయకుండా కుటుంబ సభ్యుల నుండి రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Love marriage, Nalgonda

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు