Home /News /telangana /

LORRY HIT TELANGANA HIGH COURT ADVOCATE CAR IN JAGTIAL DISTRICT BA

Telangana: హైకోర్టు లాయర్‌ను ఢీకొట్టిన లారీ.. రోడ్డు మీదే 500 మీటర్లు ఈడ్చుకెళ్లి...

దుర్గా ప్రసాద్ కారును ఢీకొట్టిన లారీ

దుర్గా ప్రసాద్ కారును ఢీకొట్టిన లారీ

తెలంగాణ హైకోర్టు న్యాయవాదిని ఓ లారీ ఢీకొట్టింది. సుమారు 500 మీటర్ల దూరం ఆ కారును అలాగే ఈడ్చుకుంటూ వెళ్లింది. జగిత్యాల జిల్లా యశ్వంతపూర్ వద్ద ఈ ఘటన జరగింది.

    తెలంగాణ హైకోర్టు న్యాయవాదిని ఓ లారీ ఢీకొట్టింది. సుమారు 500 మీటర్ల దూరం ఆ కారును అలాగే ఈడ్చుకుంటూ వెళ్లింది. జగిత్యాల జిల్లా యశ్వంతపూర్ వద్ద ఈ ఘటన జరగింది. అడ్వొకేట్ దుర్గాప్రసాద్ హైదరాబాద్ నుంచి హన్మకొండకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే, ఇది ప్రమాదమా లేకపోతే ఎవరి దైనా ప్లాన్ ఉందా అనేది తెలియలేదు. దుర్గాప్రసాద్ హైకోర్టులో లాయర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి హన్మకొండ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. స్థానికులు లారీ డ్రైవర్ ను పట్టుకుని నిలదీయగా లారీ బ్రేక్ ఫెయిల్ అయిందని, అందుకే అదుపుతప్పి కారును ఢీకొట్టిందని చెప్పాడు. న్యాయవాది దుర్గా ప్రసాద్ ఎక్కువగా భూమి వివాదాలకు సంబంధించిన కేసులను వాదిస్తారని తెలిసింది. దీనిపై పూర్తి వివరాలు రావాల్సి ఉంది.

    తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఇటీవల న్యాయవాది వామన్ రావు, నాగమణి దంపతులను దారుణంగా హత్య చేశారు. నడిరోడ్డు మీద వారిని కత్తితో నరికి చంపారు. రోడ్డు మీద అందరూ చూస్తుండగానే ఈ దారుణం జరిగింది. ఇది రాష్ట్రంలో పెద్ద సంచలనానికి దారి తీసింది. ఈ కేసు వెనుక చాలా మంది పెద్దలు ఉన్నారనే అనుమానాలను ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు వామన్ రావు దంపతుల హత్యలను నిరసిస్తూ తెలంగాణతో పాటు ఏపీలో కూడా న్యాయవాదులు ఆందోళనలు చేశారు. కోర్టు విధులను బహిష్కరించారు. ఇలా అయితే, న్యాయవాదులు విధులు నిర్వర్తించలేమని చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

    తాజాగా జరిగిన లారీ ప్రమాదం కేవలం ప్రమాదమేనా, లేకపోతే దీని వెనుక కూడా ఏమైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది. న్యాయవాది దుర్గాప్రసాద్ భూ వివాదాల కేసులను ఎక్కువగా వాదిస్తుంటారని చెబుతున్నారు. దీంతో సహజంగానే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, ఈ ప్రమాదంపై దుర్గాప్రసాద్ ఇంకా స్పందించలేదు. ఆయనకు ఎవరి మీద అయినా అనుమానాలు ఉన్నాయా? అని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అలాగే, నిందితుడు లారీ డ్రైవర్ చెప్పినట్టు బ్రేక్‌లు నిజంగానే ఫెయిల్ అయ్యాయా? లేకపోతే ఇంకేదైనా ప్లాన్ ఉందా అనేది కూడా ఆరా తీస్తున్నారు. వామన్ రావు దంపతుల హత్య తర్వాత జరిగిన కావడంతో పోలీసులు కూడా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Accident, Telangana, Telangana High Court, Warangal

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు