షాకింగ్ వీడియో.. తాగునీటి కోసం వాటర్ ట్యాంకర్ బుక్ చేస్తున్నారా?

ట్యాంకర్‌లో నీళ్లు పడుతూ కాళ్లు కడుతున్న డ్రైవర్

ప్రజలు తాగే నీటిలో ఓ ట్యాంకర్ డ్రైవర్ కాళ్లు కడిగాడు. ట్యాంకర్‌లో నీళ్లు పడుతూనే.. కాళ్లను శుభ్రం చేసుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  • Share this:
    హైదరాబాద్‌లో ప్రస్తుతం నీటి ఎద్దడి లేకున్నప్పటికీ.. HMWS&SB వాటర్ ట్యాంకర్‌లకు భారీగా డిమాండ్ ఉంది. అపార్ట్‌మెంట్‌లు, ప్రైవేట్ సంస్థలు వాటర్ ట్యాంకర్‌ల ద్వారా మంచి నీటిని తెచ్చుకుంటున్నాయి. అందుబాటు ధరలోనే వేల లీటర్ల మంచి నీరు దొరకడంతో చాలా మంది HMWS&SB వాటర్ ట్యాంకర్‌లను బుక్ చేస్తుంటారు. ఐతే అలాంటి వారికి ఇది షాకింగ్ వార్త..! మైండ్ బ్లాంకయ్యే వీడియో ఒకటి బయటకొచ్చింది. ప్రజలు తాగే నీటిలో ఓ ట్యాంకర్ డ్రైవర్ కాళ్లు కడిగాడు. ట్యాంకర్‌లో నీళ్లు పడుతూనే.. కాళ్లను శుభ్రం చేసుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్‌లో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. మూసాపేట జనతా‌నగర్‌లో మంచినీటి వాటర్ ట్యాంకర్‌లో నీళ్లను నింపుతున్న సమయంలో ట్యాంకర్ డ్రైవర్ కాళ్లను కడుగుతూ నీళ్లు పట్టాడు. అదే నీటిని ప్రజలకు సరఫరా చేశారు. ఆ దృశ్యాలను రోడ్డు మీదుగా వెళ్తున్న ఓ వ్యక్తి మొబైల్ కెమెరాలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోను చూసిన నగరవాసులు అధికారులపై మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. సదరు డ్రైవర్‌పై చర్యలు తీసుకొని.. ఇకపై అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. వాటర్ పట్టే సమయంలో HMWS&SB పర్యవేక్షించాలని లేదంటే ట్యాంకర్ల వద్ద సీసీ కెమెరాలను పెట్టాలని కోరుతున్నారు.
    First published: