వామ్మో మిడతల దండు వనపర్తి జిల్లాలోకి వచ్చేసింది...

ప్రతీకాత్మక చిత్రం

వనపర్తి జిల్లా అమరచింత మండలం దీప్లా నాయక్ తండాలో మిడతల గుంపును గుర్తించారు.

  • Share this:
    కొద్ది నెలల క్రితం భారతదేశంలో మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలల్లో పంటలను నాశనం చేసిన మిడతల దండులో ఓ గుంపు తాజాగా వనపర్తి జిల్లాలోకి ప్రవేశించాయి. ముందుగా వీటిని వనపర్తి జిల్లా అమరచింత మండలం దీప్లా నాయక్ (చంద్రప్ప నాయక్) తండాలోని వ్యవసాయ పొలంలో గుర్తించారు. మొక్క జొన్న పంటపొల్లాలో ఈ మిడతల దండు దాడి చేసి నాశనం చేస్తుంది. జొన్న చేను ఆకులను తింటూ స్థానికులకు కనిపించాయి. రాజస్థాన్, మహారాష్ట్ర రాష్ట్రాలలో పంటలను నాశనం చేస్తున్న మీడతల దండులోని ఓ గుంపు తెలంగాణలోకి వచ్చిందని అనుమానాలు మొదలయ్యాయి. దీంతో ప్రత్యక్షంగా అమరచింత మండలం చంద్రప్పతాండలో ని వ్యవసాయ పొలాలలో రైతులు వేసుకున్న జొన్న చేనులో మిడతలు ఏకదాటిగా దాడి చేస్తు నాశనం చేస్తున్న ఈ దృశ్యాలు కనిపించాయి.

    అయితే మిడతలు రావడంతో తమ పంట పొలాల గురించి స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంత రైతులను వ్యవసాయ విభాగం అధికారులు అప్రమత్తం చేశారు. మిడతలను తరిమి కొట్టేందుకు పెద్దగా శబ్దాలు చేయాలని రైతులకు సూచించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: