Home /News /telangana /

LOCKDOWN NOT NECESSARY BUT MUST BE CAREFUL SAYS TELANGANA CM KCR AMID OMICRON SPREAD MKS

lockdown : తెలంగాణలో Omicron లాక్‌డౌన్.. cm kcr స్పష్టీకరణ.. మూడో వేవ్ కలిసి వచ్చినా..

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

తెలంగాణలో ప్రస్తుతానికి లాక్ డౌన్ అవసరం లేదని, వైద్య శాఖ అధికారుల నివేదికల్లోనూ అదే అంశాన్ని పేర్కొన్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ పట్ల భయం అవసరం లేదని, అదే సమయంలో అజాగ్రత్త పనికిరాదని సీఎం అన్నారు.

తెలంగాణలో ఒమిక్రాన్ తోపాటు ఇతర వేరియంట్ల కరోనా కేసులూ పెరుగుతోన్న క్రమంలో జనవరి రెండో వారం తర్వాత లాక్ డౌన్ విధించే అవకాశాలున్నాయంటూ కొద్ది గంటలుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో లాక్ డౌన్ అవసరమే ఉండదని సీఎం కేసీఆర్ ప్రజలకు భరోసా ఇచ్చారు. తెలంగాణలో ఒమిక్రాన్, ఇతర వేరియట్ల వ్యాప్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియ తదితర అంశాలపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. సోమవారం ప్రగతి భవన్ లో ఈ సమావేశం జరగ్గా, కరోనాకు సంబంధించి కేసీఆర్ పలు కీలక సూచనలు చేశారు..

తెలంగాణలో ప్రస్తుతానికి లాక్ డౌన్ అవసరం లేదని, వైద్య శాఖ అధికారుల నివేదికల్లోనూ అదే అంశాన్ని పేర్కొన్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ పట్ల భయం అవసరం లేదని, అదే సమయంలో అజాగ్రత్త పనికిరాదని సీఎం అన్నారు. ఒమిక్రాన్ ను ఎదుర్కోడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామన్నారు. ఆస్పత్రుల్లో వసతులను మెరుగుపర్చుకోవాలని, ఆక్సిజన్ బెడ్స్, మందులను సమకూర్చుకోవాలని అధికారులకు సీఎం సూచించారు.

CM KCR : తెలంగాణలో అన్ని విద్యా సంస్థలకు సెలవులు.. సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు.. కారణం అదేనా?



లాక్ డౌన్ పై సీఎం కేసీఆర్ క్లారిటీ ఇవ్వడానికి ముందే ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ తోపాటు కొవిడ్ మూడో వేవ్ కలిసి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, నైట్ కర్ఫ్యూగానీ, లాక్ డౌన్ విధంపుగానీ అసలే ఉండబోవని ఆయన కుండబద్దలుకొట్టారు. జనవరి చివర్లో లాక్ డౌన్ ఉండొచ్చనే ప్రచారాన్ని హెల్త్ డైరెక్టర్ కొట్టిపారేశారు.
Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, Covid, Lockdown, Omicron, Telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు