Home /News /telangana /

LOCKDOWN MAY EXTENDED ONCE AGAIN IN TELANAGANA VRY

Lock down : తెలంగాణలో లాక్డౌన్ పొడగింపు తప్పదా... ? అధికార వర్గాలు ఎమంటున్నాయి..

తెలంగాణలో మరోసారి లాక్‌డౌన్‌ను పెంచే అవకాశాలు కనిపిస్తిన్నాయి..కరోనా వైరస్‌ను కట్టడి చేయాలంటే మరోవారం పొడగింపు తప్పదని అధికార వర్గాలు భావిస్తున్నాయి. దీంతో లాక్‌డౌన్ పొడగింపుకు సీఎం కేసిఆర్‌ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది..?

తెలంగాణలో మరోసారి లాక్‌డౌన్‌ను పెంచే అవకాశాలు కనిపిస్తిన్నాయి..కరోనా వైరస్‌ను కట్టడి చేయాలంటే మరోవారం పొడగింపు తప్పదని అధికార వర్గాలు భావిస్తున్నాయి. దీంతో లాక్‌డౌన్ పొడగింపుకు సీఎం కేసిఆర్‌ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది..?

Lock down : తెలంగాణలో మరోసారి లాక్‌డౌన్‌ను పెంచే అవకాశాలు కనిపిస్తిన్నాయి..కరోనా వైరస్‌ను కట్టడి చేయాలంటే మరోవారం పొడగింపు తప్పదని అధికార వర్గాలు భావిస్తున్నాయి. దీంతో లాక్‌డౌన్ పొడగింపుకు సీఎం కేసిఆర్‌ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది..?

ఇంకా చదవండి ...
తెలంగాణలో మరోసారి లాక్‌డౌన్‌ను పెంచే అవకాశాలు కనిపిస్తిన్నాయి. ఇదొక్కటే మార్గంగా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి..ఈ నేపథ్యంలోనే వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు సీఎం కేసిఆర్ సైతం ఇదే అభిప్రాయంలో ఉన్నట్టు తెలుస్తోంది..అయితే లాక్‌డౌన్ పెంపు మరోసారి చర్చించి పూర్తిస్థాయి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి..అయితే పాజిటీవ్‌ల సంఖ్య పదిహేను శాతం దాటుతోంది..దీంతో కరోనా కేసుల పాజీటివ్ శాతాన్ని అయిదు శాతం వచ్చే వరకు లాక్‌డౌన్ పొడగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా కట్టడికి లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కార మార్గంగా కనిపిస్తున్న నేపథ్యంలోనే అధికార యంత్రాంగం ఆవైపుగా మొగ్గు చూపుతుంది..ఇప్పటికే ఫస్ట్ వేవ్ తర్వాత అన్నింటికి అనుమతి ఇచ్చిన నేపథ్యంలోనే సెకండ్ ఉదృతి విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలోనే రోగుల సంఖ్య పెరిగి మరణాలు కూడ అధికమయ్యాయి. దీంతో ప్రభుత్వాలు లాక్‌డౌన్ ఎత్తివేతపై ఆచితూచి అడుగులు వేస్తున్నాయి..

కాగా తెలంగాణలో ఇప్పటికే 20 రోజుల పాటు లాక్‌డౌన్ విధించారు..వాస్తవానికి వైరల్ కట్టడికి ఏడు రోజుల నుండి పద్నాలుగు రోజుల సమయం సరిపోతున్నా..సెకండ్ ఉదృతి అంతుపట్టకుండా ఉన్న నేపథ్యంలోనే దానిపై స్పష్టత లేకుండా తయారైంది..అందుకు లాక్‌డౌన్ విధించిన ప్రభుత్వాలు కనీసం నెల రోజుల పాటు విధిస్తున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడ ఇదే పద్దతిని పాటించనున్నట్టు అధికారులు తెలుపుతున్నారు. కరోనా కేసులను భారిగా తగ్గించేందుకు మరోవారం పాటు లాక్డౌన్ విధించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. పాటిటివిటి రేటును పూర్తి స్థాయిలో కాకున్నా..కనీసం 5 శాతం మేర తగ్గేవరకు లాక్‌డౌన్ విధించడమే శరణ్యమని సమాచారం.

ప్రస్తుత లాక్‌డౌన్ మే 30న ముగియనుంది. అనంతరం మరోవారం పోడగింపు ఉంటుందని సోమవారం జరిగిన సీఎం కేసిఆర్ నిర్వహించిన సమీక్షలో కరోనా కట్టడిపై చర్చించారు. వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. కేసులు తగ్గించేందుకు లాక్‌డౌన్‌ను పొడగించాలని వైద్య ఆరోగ్యశాఖ కూడ సూచించినట్టు సమాచారం. దీంతో సీఎం కేసిఆర్ కూడ అనుకూలంగా ఉన్నారు. ఇక రాష్ట్ర రాబడులపై ప్రభుత్వం ఇప్పటికే ఆరా తీశారు. దీంతో మరో కొద్ది రోజుల పాటు ఈ పరిస్థితి నెలకొనున్నట్టు స్పష్టం అవుతోంది.
Published by:yveerash yveerash
First published:

Tags: CM KCR, Lockdown, Telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు