Home /News /telangana /

LOCKDOWN IMPOSED NEAR KUNTALA WATERFALLS NO ENTRY FOR VISITORS SU

Telangana: ఆ జలపాతం పరిసరాల్లో లాక్‌డౌన్.. సందర్శన రద్దు చేసిన అధికారులు..

కుంటాల జలపాతం

కుంటాల జలపాతం

గతేడాదితో పోల్చితే ఈసారి కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఈసారి పల్లెల్లో కూడా కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో పంజా విసురుతోంది.

    తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కుంటాల జలపాతం ఒకటి. ఆదిలాబాద్‌ జిల్లాలో ఉన్న కుంటాల జలపాతాన్ని చూసేందుకు భారీగా సందర్శకులు తరలివస్తుంటారు. అయితే కరోనా సెకండ్ నేపథ్యంలో కుంటాల జలపాతానికి సందర్శకుల అనుమతి రద్దు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నుంచి జలపాతం సందర్శన రద్దు చేస్తున్నట్టు అటవీ రేంజ్‌ అధికారి వాహబ్‌ అహ్మద్‌ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. జలపాతం పరిసరాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించారు. దీనిని గమనించి పర్యాటకులు కుంటాల జలపాతం సందర్శనకు రావద్దని కోరారు. అటవీ సిబ్బందికి సహకరించాలని కోరారు.

    ఇక, తెలంగాణలో కరోనా సేకండ్ వేవ్ కొనసాగుతుంది. నిన్న రాత్రి 8 గంటల వరకు తెలంగాణలో కొత్తగా 7,430 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,50,790కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో 56 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 2,368కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 80,695 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

    Long COVID Symptoms: లాంగ్ కోవిడ్ అంటే ఏమిటి..?.. ఈ మూడు లక్షణాలు వేధిస్తున్నాయా..?

    Jana Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి షాకింగ్ నిర్ణయం.. సాగర్ ఉప ఎన్నికలో ఓటమి తర్వాత అనుహ్యంగా..

    గతేడాదితో పోల్చితే ఈసారి కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఈసారి పల్లెల్లో కూడా కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడిలో భాగంగా కొన్ని గ్రామాలు, పట్టణాలు సెల్ఫ్ లాక్‌డౌన్ బాట పట్టాయి. మరికొన్ని చోట్ల స్వచ్ఛందంగా ఆంక్షలు అమలు చేసుకుంటున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Adilabad, Covid-19, Lockdown, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు