మటన్ ధరను ఫిక్స్ చేసిన తెలంగాణ సర్కారు..

మాంసం జీర్ణం కావడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. రాత్రిపూట మాంసం తినడం వల్ల జీర్ణవ్యవస్థ మీద భారం పడుతుంది. తద్వారా జీర్ణ సమస్యలు వస్తాయి.

లాక్‌డౌన్ ప్రభావంతో మాంసం ధరలకు రెక్కలొచ్చాయి. మాంసం విక్రయం దారులు ఇష్టమొచ్చినట్లు రేట్లు పెంచుతూ అమ్మకాలు చేపడుతున్నారు. వాళ్లపై తెలంగాణ సర్కారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

  • Share this:
    లాక్‌డౌన్ ప్రభావంతో మాంసం ధరలకు రెక్కలొచ్చాయి. మాంసం విక్రయం దారులు ఇష్టమొచ్చినట్లు రేట్లు పెంచుతూ అమ్మకాలు చేపడుతున్నారు. వాళ్లపై తెలంగాణ సర్కారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వమే స్వయంగా రంగంలోకి మాంసం ధరలను ఫిక్స్ చేసింది. కిలో మటన్ ధర రూ.700కే అమ్మాలని స్పష్టం చేసింది. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు పశు సంవర్థక శాఖ ప్రత్యేక కమిటీ కన్వీనర్‌ డాక్టర్‌ బాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దుకాణాల ముందు ధర తెలిపే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. మాంసం ధరలపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో మంత్రి తలసాని ఆదేశాల మేరకు మాంసం ధరల నియంత్రణకు కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, బజార్‌ఘాట్‌ తదితర ప్రాంతాల్లోని సుమారు 11 మాంసం దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. లైసెన్స్‌ లేని, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఐదు దుకాణాలను మూసి వేశారు.

    కాగా, కరోనా వైరస్ తొలి రోజుల్లో చికెన్ రేట్లు భారీగా పడిపోయాయి. కొన్ని చోట్ల ఉచితంగా కోళ్లు పంపిణీ చేసిన సందర్భాలు ఉన్నాయి. కిలో చికెన్ రూ.50కి మించలేదు. అయితే, చికెన్ తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ప్రభుత్వమే స్వయంగా ప్రకటన ఇవ్వడంతో ఒక్కసారిగా చికెన్ రేట్ కూడా అమాంతం పెరిగింది. దానికి తగ్గట్లు డిమాండ్ కూడా పెరగడంతో మాంసం వ్యాపారులు భారీగా రేట్లు పెంచేశారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: