• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • LOCK DOWN EFFETCT HUSBAND COMMITS SUICIDE DUE TO NO MONEY FOR WIFES DELIVERY IN TELANGANA VB

Suicide: లాక్​డౌన్​ ఎఫెక్ట్​.. భార్య డెలివరీకి డబ్బులు లేక భర్త ఆత్మహత్య.. విషయం తెలిసిన భార్య..

ప్రతీకాత్మక చిత్రం

Suicide: భార్య డెలివరీకి సంబంధించి డబ్బులు లేకపోవడంతో భర్త చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్నభార్య బోరునవిలపించింది. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.

  • Share this:
    కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుంతలం చేసింది. కరోనాసెకండ్ వేవ్ తో ప్రజలపై విరుచుకుపడింది. అసలే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సామాన్యుడికి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు అయింది. కరోనా, లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఆరు నెలలుగా డబ్బులు లేక తన భార్య కాన్పుకు సంబంధించి డెలివరీకి డబ్బులు లేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. నికి సంబంధించిన పూర్తి వివరాలు సిద్దిపేట టూ టౌన్​ సీఐ పరుశురాంగౌడ్​ తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా చందాపూర్​ గ్రామానికి చెందిన పడాడ ప్రశాంత్(25), నాగమణి భార్యాభర్తలు. కొన్నాళ్లుగా సిద్దిపేటలో ఉంటూ ఆటో నడుపుకుంటున్నాడు. కరోనా, లాక్​డౌన్​ఎఫెక్ట్​తో ఆటో నడవక, దాని ఈఎంఐలు కట్టడానికి, కుటుంబ పోషణకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఇటీవల తెచ్చిన అప్పులకు మిత్తీలు కట్టేందుకు బైక్​ను అమ్మేశాడు.

    దీనికితోడు భార్య డెలివరీ టైం దగ్గరపడడంతో వారం క్రితం ఆమెను టౌన్​లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్​ చేశాడు. ఆదివారం ఆమెను డిశ్చార్జ్ చేయాల్సి ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. తనలో తను మదనపడుతూ మానసికంగా కుంగిపోయాడు. చేతిలో పైసలు లేవనే బాధలో పత్తి మార్కెట్ దగ్గర లోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని ప్రశాంత్​ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య అంజలి కన్నీరుమున్నీరయ్యింది.

    ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రశాంత్​ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Veera Babu
    First published: