హోమ్ /వార్తలు /తెలంగాణ /

Karimnagar: జొన్న రొట్టెలతో మహిళలకు ఉపాధి.. రోజుకు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా..?

Karimnagar: జొన్న రొట్టెలతో మహిళలకు ఉపాధి.. రోజుకు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా..?

రొట్టెలు చేస్తున్న  మహిళ

రొట్టెలు చేస్తున్న మహిళ

Karimnagar: షుగర్ తో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు రాత్రిపూట జొన్న రొట్టెలనే ఆహారంగా తీసుకుంటున్నారు. జొన్న రొట్టెలో హెల్తీ ఫ్యాట్ ప్రోటీన్లు కార్బోహైడ్రేట్ కాల్షియం ఐరన్ ఉంటున్నాయని జనం అంటున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Karimnagar

(శ్రీనివాస్ పి. న్యూస్ 18తెలుగు ప్రతినిధి, కరీంనగర్ జిల్లా)

ఈకాలం ప్రజలకు పిజ్జాలు, బర్గర్‌లు, బటర్ నాన్, తందూరి రోటి తప్ప.. జొన్న రొట్టె జొన్నగాడ్కా తెలియని పరిస్థితి ఉంది.వంటింటి ఎన్నో పోషక విలువలు ఉండే జొన్నలు వాడకం తగ్గిపోయింది. ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లాలో ఒకప్పుడు పచ్చ జొన్నలు తెల్లజొన్నలు పుష్కలంగా పండించేవారు. ఇప్పుడు వరి పత్తి అక్కడక్కడ మొక్కజొన్న తప్ప చిరుధాన్యాల పంటలు కనిపించడం లేదు. వీటిలో ఆరోగ్యకరమైన ఆహారంగా జొన్నగడ్కకు జొన్న రొట్టెలకు (Jowar Roti) గుర్తింపు ఉంది. పట్టణ నగర జీవులకు పరుగు తీయడంతోనే జీవితం గడిచిపోతుంది. పని ధ్యాసలో పడి ఆరోగ్యకరమైన తిండి మరిచిపోతున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇప్పటికీ పాతకాలంనాటి వంటకాలను తినేందుకు ఇష్టపడుతున్నారు.ఈమధ్య జొన్న రొట్టెలకు ప్రాధాన్యం పెరిగింది.

కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలో పలుచోట్ల జొన్న రొట్టెలు తయారుచేసి అమ్మే వారి సంఖ్య పెరిగింది. జనం నుంచి వీటికి మంచి స్పందన వస్తుంది. కరీంనగర్ లోనే కలెక్టర్ రేట్ రోడ్డు అంబేద్కర్ స్టేడియం మిషన్ హాస్పిటల్ ఏరియా రాంనగర్ బస్టాండ్ ఏరియాలో జొన్న రొట్టెలు తయారుచేసి ఉపాధి పొందుతూన్నరు. నల్గొండ, సూర్యాపేట , పాత వరంగల్ జిల్లా పరిధిలోని కొంతమంది గిరిజన కుటుంబాలు సాయంత్రం జొన్న రొట్టెలు తయారు చేసి అమ్ముతున్నారు. రెండు జొన్న రొట్టెలకు కాంబినేషన్ గా కారంతో చేసిన తొక్కు టమాటా పచ్చడి అందిస్తున్నారు. షుగర్ వ్యాధి (Diabetes) బాధితులకు జొన్న రొట్టె మంచిదన్న నమ్మకంతో ఎక్కువ మంది వీటిని తినేందుకు వస్తున్నారు. విద్యార్థులు పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటున్న యువతీ యువకులు వీటికోసం ఎగబడుతున్నారు. ఇంట్లో ఉండే పేషంట్ల కోసం చాలా మంది జొన్న రొట్టెలు తీసుకెళ్తున్నారు. ఒక్కో రొట్టె 20 రూపాయలు అమ్ముతున్నారు.  సాయంత్రం 5:00 నుంచి రాత్రి 9 గంటలకు వీటి అమ్మకాలు కొనసాగుతున్నాయి.

ఇలా చాలామంది రొట్టెల తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. అన్ని ఖర్చులు పోను.. రోజుకు 400నుండి 500వరకు ఆదాయం వస్తుందని అమ్మకం దారులు అంటున్నారు.  షుగర్ తో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు రాత్రిపూట జొన్న రొట్టెలనే ఆహారంగా తీసుకుంటున్నారు. జొన్న రొట్టెలో హెల్తీ ఫ్యాట్ ప్రోటీన్లు కార్బోహైడ్రేట్ కాల్షియం ఐరన్ ఉంటున్నాయి అంటున్నారు జనం.పచ్చ జొన్నలు కలిపి రొట్టెలు చేసి అమ్ముతున్నారు. ఇలా ఒకరిని చూసి ఒకరు జిల్లావ్యాప్తంగా ప్రధాన సెంటర్ ల వద్ద తోపుడు బండ్లపై రొట్టెలు తయారు చేస్తూ ఇంటిలిపదు ఉపాధి పొందుతున్నరు. జొన్న రొట్టెలు తినడం వాళ్ళ కూడా ఆరోగ్యనికి మంచిదని డాక్టర్లు కూడా అంటున్నారు.

First published:

Tags: Jowar Roti, Karimnagar, Telangana

ఉత్తమ కథలు