Home /News /telangana /

TS NEWS : స్థానిక పంచాయితీ ప్రజా ప్రతినిధులకు గౌరవ వేతనం పెంపు..

TS NEWS : స్థానిక పంచాయితీ ప్రజా ప్రతినిధులకు గౌరవ వేతనం పెంపు..

ts news

ts news

TS NEWS : స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారికి మరోసారి గౌరవ వేతనం పెంచుతూ రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ సెక్రటరీ జీవో విడుదల చేశారు. ఇదే విషయాన్ని మంత్రి హరీష్ రావు ఇది ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శమని పేర్కొన్నారు.

ఇంకా చదవండి ...
  రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్థానిక పంచాయితీ ప్రజా ప్రతినిధులకు గౌరవ వేతనం పెంచారు. ఇందుకు సంబంధించి జీవో కూడా విడుదలైంది. వేతనాల పెంపుకు సంబంధించి మంత్రి హరీష్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. వేతనాల పెంపు ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనం అన్నారు. స్థానిక సంస్థలను బలోపేతం చేసి, గ్రామీణాభివృద్దిలో వాటి పాత్రను క్రియాశీలం చేస్తామన్న సీఎం హామి మేరకు ఉద్యోగులతోపాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ముప్పై శాతం మేర గౌరవ వేతనం పెంచడం ప్రభుత్వ చిత్త శుద్దికి నిదర్శనం అన్నారు.

  ts news, local bodies salaries, telangana news, sarpanch salaray , ప్రజా ప్రతినిధులకు గౌరవ వేతనం పెంపు, సర్పంచ్‌లకు గౌరవ వేతనం ,

  కాగా గౌరవ వేతనం పెరిగిన వారిలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటిసీలతోపాటు ఎంపీపీలు ఉన్నారు. వీరికి గతంలో ఉన్న వేతనం కంటే 30 శాతం అదనంగా గౌరవ వేతనం పెంచారు. ప్రస్తుతం సర్పంచ్‌‌లు ఎంపీటిసిలకు ప్రతి నెల 5000 వేలు ఇస్తుండగా ఇక నుండి 6500 రూపాయలు ఇవ్వనున్నారు. జడ్పీటీసికిలతోపాటు ఎంపీలకు ప్రస్తుతం 10వేలు ఉండగా 3000 పెంచి పదమూడు వేలు చేశారు.పెరిగిన వేతనాలు జూలై మాసం నుండే అమల్లోకి రానున్నాయి.

  మీ నగరం నుండి (​హైదరాబాద్)

  తెలంగాణ
  ​హైదరాబాద్
  తెలంగాణ
  ​హైదరాబాద్
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Salaries hike, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు