స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభకావడంతో టీఆర్ఎస్ అధినేత తమ పార్టీ అభ్యర్థులపై కసరత్తు పూర్తి చేశారు. కాగా మొత్తం 12 స్థానాలకు గాను మెజారీటి స్థాయిలో తిరిగి పాతవారికే కట్టబెట్టనున్నారు. కాగా అభ్యర్ధులు మంగళవారం నామినేషన్స్ వేయనున్నట్టు సమాచారం.
ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఉన్న నేపథ్యంలో శనివారం రాత్రి ప్రగతి భవన్ లో మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు సీఎం కేసీఆర్. అభ్యర్థుల ఎంపికపై జిల్లాల వారిగా సమాచారం తీసుకుని చర్చించారు. పార్టీ భవిష్యత్ తోపాటు స్థానికంగా ఉండే బలబలాలతో పాటు పార్టీకి విధేయంగా ఉండే వారిని ఎంపిక చేసే విధంగా ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా 12 మంది అభ్యర్థులను ఫైనల్ చేసినట్టు సమాచారం. అయితే ఈ 12 మందిలో తిరిగి పాతవారినే అభ్యర్థులుగా ఎంపిక చేసినట్టు మంత్రులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. కొన్ని మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తుండడంతో వారు ఎవరనేది తేలాల్సి ఉంది. ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించకుండానే మంగళవారం నామినేషన్లను దాఖలు చేయాలని గులాబీ బాస్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.
ఇది చదవండి : రైతు పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారికి తెలంగాణ పరిహారం , ప్రకటించిన సీఎం కేసిఆర్
ఎంపిక చేసిన అభ్యర్థులకు పూర్తిగా సహకరించాలని సీఎం కేసిఆర్ మంత్రులకు ఆదేశించారు. ప్రతి ఒక్కరు గెలుపు కోసం ఆయా జిల్లాలోని ప్రజాప్రతినిధులు కృషి చేయాలని చెప్పారు. ఇందుకోసం జిల్లాలోనే సమావేశాలు ఏర్పాటు చేసి , పోటిలో ఉన్న అభ్యర్థులకు మద్దతు సమీకరించాలని చెప్పారు. ఇక స్థానాలు దక్కని సిట్టింగ్ అభ్యర్థులతో పాటు ఆశావహులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, రానున్న రోజుల్లో అనేక అవకాశాలు ఉంటాయని , వారికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.
మంగళవారం చివరి తేది.
నామినేషన్లకు గడువు 23 నాటికి ముగియనుండడంతో అభ్యర్థులంతా ఆ రోజే నేరుగా నామినేషన్లు వేయనున్నారు. 24 నామినేషన్ల పరీశీలన, 26 వతేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉండగా డిశంబర్ 10 పోలింగ్ జరగనుంది. డిశంబర్ 14 ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. కాగా తెలంగాణలోని హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ , రంగారెడ్డి, మహాబుబ్‌నగర్ జిల్లాల్లో 2 స్థానాలు, మిగతా జిల్లాల్లో ఒక్కోస్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Mlc elections