Home /News /telangana /

LOAN APPS MANAGERS ARE MORPHING PHOTOS OF FRIENDS INTO NUDE THAT THE LOAN IS NOT PAYING OFF PRV

Loan Apps: మీ మిత్రుడు లోన్​యాప్స్​ నుంచి రుణం తీసుకున్నాడా? అయితే మీకూ చిక్కులు ఎదురైనట్లే.. ఎందుకంటే..?

 (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

ఇటీవల పర్సనల్ లోన్ యాప్స్ కుప్పలుతెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. బ్యాంకులు ఇచ్చే రుణాల కన్నా వేగంగా పర్సనల్ లోన్ యాప్స్ రుణాలు ఇస్తున్నాయి. ఇపుడు ఇదే రుణాలు తీసుకున్న వారికి శాపంగా మారుతోంది.

  ఒకప్పుడు పర్సనల్ లోన్ (Personal Loan) తీసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. లోన్ కోసం దరఖాస్తు చేయడం, బ్యాంకు దరఖాస్తుని పరిశీలించడం, వెరిఫికేషన్ కోసం బ్యాంకు సిబ్బంది ఇంటికి రావడం, ఆదాయ వివరాలు పరిశీలించిన రుణం మంజూరు చేయాలో, వద్దో నిర్ణయించడం... ఇలా చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. ఈ మొత్తం ప్రాసెస్‌కు రెండుమూడు వారాల సమయం పట్టేది. ఇప్పుడు పర్సనల్ లోన్ తీసుకోవడం నిమిషాల్లో పని. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే, మంచి క్రెడిట్ హిస్టరీ ఉంటే 10 నిమిషాల్లో కూడా రుణాలు ఇచ్చే సంస్థలు ఉన్నాయి. ఇక ఇటీవల పర్సనల్ లోన్ యాప్స్ కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. బ్యాంకులు ఇచ్చే రుణాల (Debt) కన్నా వేగంగా పర్సనల్ లోన్ యాప్స్ రుణాలు ఇస్తున్నాయి. ఇపుడు ఇదే రుణాలు తీసుకున్న వారికి శాపంగా మారుతోంది. సకాలంలో రుణాలు చెల్లించకపోతే ఈ యాప్​ (App)ల నిర్వాహకులు వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ యాప్​ల కారణంగా వందలాది మంది బాధితులు ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు. తాజాగా ఈ యాప్​ల వేధింపులు విపరీత పోకడలకు వెళ్లాయి.  బాధితుల మిత్రుల ఫొటోలను మార్పింగ్​ చేసి నగ్న చిత్రాలుగా మార్చడం కలకలం రేపుతోంది.

  హైదరాబాద్ (Hyderabad)​ నగరానికి చెందిన ఓ యువకుడు లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు. సకాలంలో చెల్లించకపోవడంతో నిర్వాహకులు నుంచి ఒత్తిడి మొదలైంది. అసలు, వడ్డీ చెల్లించేంత వరకు వదలం అంటూ వెంట పడ్డారు. అతను నుంచి స్పందన రాకపోవడంతో.. బాధితుడి ఫోన్ లోని నెంబర్ ఆధారంగా అతడి మిత్రుల వాట్సాప్ డీపీ  (WhatsApp DP)మంచి ఫోటోలు సేకరిస్తున్నారు. వాటిని నగ్న చిత్రాలుగా మార్కింగ్ చేసి.. వారికే పంపి మీ స్నేహితుడు అప్పు తీర్చుకుంటే ఇవన్నీ బయటకు పంపుతామని బ్లాక్ మెయిల్ (Blackmails) చేస్తున్నారు.



  మగవాళ్ళు ఏదోవిధంగా ధైర్యంగా ఉన్నా.. మహిళలు, యువతులు స్నేహితుల జాబితాలో ఉన్నప్పుడు అడిగినంత సొమ్ము చెల్లించి పరువు కాపాడుకుంటున్నారు. రేతిబౌలికి చెందిన మహిళ (Woman) ఇంటి అవసరాలకు అధిక వడ్డీకి పలు రుణయాప్ ల నుంచి రెండు లక్షలు తీసుకుంది. చెల్లించడంలో ఆలస్యం కావడంతో ఆమె సహచర ఉద్యోగులకు ఫోన్ చేసి కించ పరిచారు. ఆమె ఫోన్ నెంబర్ ను 500 మంది యువకులకు ఇచ్చారు. వారి నుంచి అసభ్యంగా ఫోన్ రావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. మలక్పేట్ యువకుడు రూ.1.5 లక్షల అప్పు చెల్లించకపోవడంతో అతడు మరణించినట్లు శవానికి దండవేసి మార్ఫింగ్ ఫొటోను కుటుంబ సభ్యులు, స్నేహితులు ఫోన్ నెంబర్ల (Friends Phone number)కు వాట్సప్ ద్వారా చేరవేశారు.

  దాదాపు 1,100 ఆన్‌లైన్ లోన్ యాప్‌లు..

  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reseve Bank of India) ఇటీవల ఓ నివేదిక విడుద‌ల చేసింది. ఈ నివేదిక ఆధారంగా దేశంలో ఇంటర్నెట్ ప్లాట్‌ఫారమ్‌లలో దాదాపు 1,100 ఆన్‌లైన్ లోన్ యాప్‌ (Loan apps)లు ఉన్నాయని వెల్లడించింది. ఈ ఆండ్రాయిడ్ యాప్‌ల‌లో 600 పైగా చ‌ట్ట విరుద్ధంగా ఉన్న‌ట్టు ఆర్‌బీఐ గుర్తించింది. ఈ నేప‌థ్యంలో స్కామ్‌లను నిరోధించడానికి సెంట్రల్ బ్యాంక్ ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్ ఈ డిజిటల్ లెండింగ్ యాప్‌ల నియంత్ర‌ణ కోసం చట్టాన్ని రూపొందించాల‌ని కోరింది. ఇటీవ‌ల కాలంలో లోన్ యాప్‌ల స్కామ్‌లు త‌రచుగా బ‌య‌ట‌ప‌డ‌డం ప‌లు చోట్ల ఫిర్యాదులు రావ‌డంతో వీటిపై నియంత్ర‌ణ అవ‌స‌రం అనే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసింది. ఫైనాన్స్ రంగంలో సాంకేతిక పురోభివృద్ధ ఆహ్వానించ‌ద‌గ్గ‌దే అయిన‌ప్ప‌టికీ వాటిపై నియంత్ర‌ణ అవ‌స‌రం. క‌స్ట‌మ‌ర్ డేటా గోప్య‌త‌ (Data Security), చ‌ట్ట‌విరుద్ధ‌మైన పెట్టుబ‌డులు వంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సిన అవ‌ర‌సం ఉంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేసింది.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Crime news, Hyderabad, Loan apps, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు