హోమ్ /వార్తలు /తెలంగాణ /

మందుబాబులకు మరో షాక్.. తెలంగాణ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు..

మందుబాబులకు మరో షాక్.. తెలంగాణ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు..

క్వార్టర్ బాటిల్ మీద కనీసం రూ.30 నుంచి రూ.40 వరకు తగ్గే అవకాశం ఉంది.

క్వార్టర్ బాటిల్ మీద కనీసం రూ.30 నుంచి రూ.40 వరకు తగ్గే అవకాశం ఉంది.

Wine shops : మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. మార్చి 31 వరకే వైన్స్ బంద్ అవుతాయని, ఆ తర్వాత తెరుస్తారని ఆశపడ్డవారికి చేదు వార్త చెప్పింది.

  Wine shops : మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. మార్చి 31 వరకే వైన్స్ బంద్ అవుతాయని, ఆ తర్వాత తెరుస్తారని ఆశపడ్డవారికి చేదు వార్త చెప్పింది. లాక్ డౌన్ ఉన్న ఏప్రిల్ 14 వరకు వైన్స్ తెరిచేది లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా దీనిపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ డైరెక్ట‌ర్ ఉత్తర్వులు జారీ చేశారు. వైన్ షాపులు, బార్లు, క్ల‌బ్స్, టూరిజం బార్లు, క‌ల్లు దుకాణాలు మరో రెండు వారాల పాటు బంద్ అవుతాయని స్పష్టం చేశారు. నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. డిప్యూటీ క‌మిష‌న‌ర్లు, అసిస్టెంట్ క‌మిష‌న‌ర్లు, జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు.

  తెలంగాణ ప్రభుత్వ తాజా ఉత్తర్వులు

  కాగా, మద్యం అందుబాటులో లేకపోవడంతో మద్యానికి బానిసైన వారి పరిస్థితి దారుణంగా తయారైంది. మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్నారు. వారిని చికిత్సకోసం హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు. మంగళవారం ఒక్క రోజే ఎర్రగడ్డ ఆస్పత్రికి 198 మంది ఔట్‌ పేషెంట్లు వచ్చినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

  Published by:Shravan Kumar Bommakanti
  First published:

  Tags: Liquor, Liquor sales, Lockdown, Telangana News, Wine shops

  ఉత్తమ కథలు