హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: హోలీ వేళ మద్యం ప్రియులకు హైదరాబాద్ సీపీ షాక్.. ఒక్కరోజే అనుకునేరు.. కాదు..

Hyderabad: హోలీ వేళ మద్యం ప్రియులకు హైదరాబాద్ సీపీ షాక్.. ఒక్కరోజే అనుకునేరు.. కాదు..

హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్

హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్

హోళీ పండుగ వేళ మందుబాబులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ షాకిచ్చారు. కరోనా కేసులు ఇంతలా పెరుగుతున్నా పట్టించుకోకుండా హోళీకి మందేసి.. చిందేద్దామనుకునే వాళ్లకు సీపీ ప్రకటన దిమ్మతిరిగేలా చేసింది. హోళీ పండుగ నేపథ్యంలో.. మద్యం దుకాణాలపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు ...

ఇంకా చదవండి ...

హైదరాబాద్: హోలీ పండుగ వేళ మందుబాబులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ షాకిచ్చారు. కరోనా కేసులు ఇంతలా పెరుగుతున్నా పట్టించుకోకుండా హోలీకి మందేసి.. చిందేద్దామనుకునే వాళ్లకు సీపీ ప్రకటన దిమ్మతిరిగేలా చేసింది. హోలీ పండుగ నేపథ్యంలో.. మద్యం దుకాణాలపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ప్రకటన విడుదల చేశారు. హోలీ పండుగ రోజైన మార్చి 28 సాయంత్రం 6 గంటల నుంచి.. మార్చి 30న ఉదయం 6 గంటల వరకూ హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించి మద్యం దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్‌లో మద్యం దుకాణాలు, బార్లు తెరవకూడదని ఆదేశించారు. సీపీ ఆదేశాలతో మార్చి 28 సాయంత్రం నుంచి 36 గంటల పాటు హైదరాబాద్‌లో మద్యం విక్రయాలు బంద్ కానున్నాయి. కరోనా కేసులు తెలంగాణలో కూడా, మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మరోసారి పెరుగుతుండటంతో పండుగల వేళ మద్యం అమ్మకాలు జరపకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కూడా హైదరాబాద్ నగరంలో మద్యం దుకాణాలు తాత్కాలికంగా మూతబడిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నిలక ప్రచారం ముగిసిన మార్చి 12వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి ఎన్నికలు జరిగిన మార్చి 14వ తేదీ వరకూ మద్యం దుకాణాలు, పబ్బులు, బార్లు హైదరాబాద్‌లో మూతపడ్డాయి. తాజాగా హోలీ నేపథ్యంలో మరోసారి మద్యం అమ్మకాలకు బ్రేక్ పడనుంది. కేవలం మద్యం అమ్మకాలపైనే కాదు.. హోలీ పండుగ నేపథ్యంలో రంగులు చల్లుకోవడంపై కూడా హైదరాబాద్‌ నగరంలో ఆంక్షలు విధించారు.

ఖమ్మంలో జరగబోయే బహిరంగ సభ పోస్టర్‌ను ఆవిష్కరించిన షర్మిల

బహిరంగ ప్రదేశాలు, ప్రధాన రోడ్లపై రంగులు చల్లుతూ పాదచారులను, వాహనదారులను ఇబ్బందిపెడితే చర్యలు తప్పవని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు. తెలంగాణలో బుధవారం రాత్రి 8 గంటల వరకూ 56,464 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 493 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇందులో మెజార్టీ కరోనా కేసులు హైదరాబాద్‌లోనే నమోదు కావడం గమనార్హం. దీంతో.. నగరంలో కఠిన ఆంక్షలు విధించక తప్పదని ప్రభుత్వం భావిస్తోంది. నగర పరిధిలో కరోనా కేసుల సంఖ్య ఇలానే పెరిగితే నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం కూడా ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని, అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని మంత్రి ఈటెల రాజేందర్ ఇప్పటికే ప్రకటించారు.

First published:

Tags: Holi, Holi 2021, Hyderabad, Liquor shops

ఉత్తమ కథలు