హోమ్ /వార్తలు /తెలంగాణ /

Huzurabad : అక్కడ ప్రతిరోజు పండగే.. 100 కోట్ల మద్యం జాతర.. కారణం ఇదే..!

Huzurabad : అక్కడ ప్రతిరోజు పండగే.. 100 కోట్ల మద్యం జాతర.. కారణం ఇదే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Huzurabad : హుజురాబాద్ లో మద్యం ఏరులు కాదు... కాలువలై పారుతుంది.. రోజు కోట్ల రూపాయల మద్యంతో గ్రామాల్లో ప్రతిరోజు పండగ వాతావరణం ఏర్పడుతుంది. కొన్ని గ్రామాలైతే జాతరను తలపిస్తూ రోజుకు సరాసరిన కోటి రూపాయల మద్యం కాలువలై పారుతోంది.

  కరీంనగర్ జిల్లా..న్యూస్ 18తెలుగు కరస్పండెంట్. శ్రీనివాస్. పి

  ఎన్నికలంటే (Huzurbad by elections) మద్యం, డబ్బు ప్రవాహం.. ఇవి.. లేనిదే ఏ ఎన్నికలు కొనసాగని పరిస్థితి.. సాధారణ ఎన్నికల్లోనే ఇవి ఏరులై పారుతోంది. మరి రెండు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరి కొనసాగుతున్న హుజూరాబాద్(huzurabad) ఎన్నికల్లో అయితే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.. గత రెండు నెలలుగా నియోజకవర్గలో పార్టీల మధ్య తేడాలు లేకుండా మద్యం ఏరులు కాదు.. కాలువలై పారుతుంది.. దీంతో ఆ నియోజకవర్గంలోని పత్రి రోజు పండగే(festival) అన్నట్టుగా పరిస్థితి కొనసాగుతోంది. పండగలు ,ప్రత్యేక దినాలు అయితే మరింత జోరుగా ప్రచారంతో పాటు మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. మద్యం కోసం నాయకులు ఏకంగా కార్యకర్తలకు మద్యం ,మాంసం చిట్టీలు ఇస్తున్నారు. దీంతో ప్రచారం ముగిసిందంటే నియోజకవర్గంలో ఉన్న బెల్టు షాపుల నుండి వైన్స్‌లు బార్లు పూర్తిగా నిండిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.

  హుజూరాబాద్ నియోజకవర్గంలో, మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Eetala Rajender)ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి.. రాజకీయ పరిణామాలతో పాటు నియోజకవర్గంలో ఎన్నికల వేడి రాజుకుంది. రెండు ప్రధాన పార్టీల మధ్య పోరు హోరాహోరిగా కొనసాగుతోంది. కొన్ని రోజులైతే.. రెండు పార్టీల రాజకీయ ఉద్దండులందరూ హుజూరాబాద్‌లోనే మకాం వేసిన పరిస్థితి కనిపించింది.

  ఇది చదవండి : రేపే.. గణేష్ నిమజ్జనం అంతా సిధ్దం .. 320 కి.మీ.ల పొడవునా గణేశ్ శోభాయాత్ర


  ముఖ్యంగా రెండు పార్టీలు గత నెలలోనే ఎన్నికలు ఉంటాయని భావించి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకోసం పార్టీ నేతలను మండలాల వారీగా ఇంచార్జ్‌లుగా నియమిమించి క్యాంపు రాజకీయాలు ప్రారంభించారు...ఇలా ఇరు పార్టీలు పోటాపోటీగా దూసుకుపోతున్న క్రమంలో విందు రాజకీయాలు కూడా జోరం దుకున్నాయి .

  అయితే ఇటివల ఎన్నికల కమిషన్ (Election comission)ఉప ఎన్నికల నిర్వహాణపై వెనక్కి తగ్గడంతోపాటు గత ఆగస్టు నెల శ్రావణమాసం కావడంతో కొంతమద్యం అమ్మకాలు(Liquor sell) తగ్గినట్టు చెబుతున్నారు. అది మినహా మూడు నెలలుగా మద్యం ఏరులై పారుతుంది, అంతకు ముందు జూన్ , జూలైలో అయితే ఒక్కసారిగా అమ్మకాలు పెరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి.

  ఇది చదవండి : గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు ఇవే.. ఆ రూట్లలో సాధారణ ట్రాఫిక్ నిషేధం


  ఈ క్రమంలోనే హుజురాబాద్ నియోజకవర్గంలో మొత్తం 29 మద్యం దుకాణాలు ఉన్నా యి . హుజురాబాద్ పట్టణం , మండలం లో కలిపి 9 దుకాణాలు , వీణవంక , ఇల్లందకుంట , జమ్మికుంటలలో కలిపి 15 దుకాణాలు , వరంగల్ జిల్లా పరిధిలో ఉన్న కమలాపూర్ లో 5 మద్యం దుకా ణాలు ఉన్నాయి . వీటి పరిధిలో గ్రామా నికి ఒకటి రెండు బెల్ట్ షాపులు పని చేస్తున్నాయి .

  హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లోని మద్యం షాపుల్లో వందకోట్ల(100 crore) మద్యం అమ్మకాలు దాటాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. . ఈ లెక్కన ఈ ఎక్సైజ్ శాఖ అమ్మకాల్లో రికార్డు గత సంవత్సరం రికార్డును దాటనుందని తెలుస్తోంది .

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Huzurabad By-election 2021, Karimnagar