తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు.. ఏ బాటిల్‌ ధర ఎంతంటే..

పక్క రాష్ట్రాల మూలంగా తెలంగాణలోనూ వైన్ షాపులను తెరవబోతున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్.. లిక్కర్ రేట్లను కూడా పెంచుతున్నట్లు చెప్పారు.

news18-telugu
Updated: May 6, 2020, 7:05 AM IST
తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు.. ఏ బాటిల్‌ ధర ఎంతంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Wineshops in Telangana : పక్క రాష్ట్రాల మూలంగా తెలంగాణలోనూ వైన్ షాపులను తెరవబోతున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్.. లిక్కర్ రేట్లను కూడా పెంచుతున్నట్లు చెప్పారు. నిన్న మీడియాతో మాట్లాడిన సీఎం.. గ్రీన్, ఆరెంజ్ జోన్లతో పాటు రెడ్ జోన్లలోనూ మద్యం దుకాణాలు తెరుస్తామని స్పష్టం చేశారు. కేవలం 15 కంటైన్మెంట్ జోన్లలో మాత్రం మద్యం షాపులు తెరవడం లేదని స్పష్టం చేశారు. అయితే, బార్లు, పబ్‌లు మాత్రం తెరుచుకోవని అన్నారు. అయితే, ఈ సమయంలో మద్యం ధరలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. అందుకే.. చీప్ లిక్కర్‌పై 11 శాతం, మిగతా బ్రాండ్లపై 16 శాతం పెంపు ఉంటుందని అన్నారు. ఈ మేరకు ధరలను నిర్ణయించింది ప్రభుత్వం. ఆ ధరలు ఇలా ఉన్నాయి..

రేట్లు ఇలా..కేటగిరి 90 ఎంఎల్/180 ఎంఎల్375 ఎంఎల్ 750 ఎంఎల్
ఆర్డినరీ రూ.10 రూ.20 రూ.40
మీడియం రూ.20 రూ.40 రూ.80
ప్రీమియం రూ.30 రూ.60 రూ.120
స్కాచ్ రూ.40 రూ.80 రూ.160
బీర్ (అన్ని సైజులపై) ఫ్లాట్ రూ.30

కాగా, వైన్ షాపుల దగ్గర భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని సీఎం కేసీఆర్ తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు తెరిచి ఉంటాయని, మాస్కులు ఉంటేనే షాపు యజమానులు మద్యం అమ్ముతారని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వైన్ షాపుల వద్ద ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
First published: May 6, 2020, 7:04 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading