మీకు మద్యం కావాలా.. అయితే మాకు కాల్ చేయండి.. చేశారో ఇక మీ సంగతి అంతే..

రోజుల తరబడి ఇంట్లో ఖాళీగా ఉంటుండడం.. వేరే పని లేకపోవడంతో మందుబాబులకు చిర్రెత్తుకొస్తుంది. స్నేహితుడు ఎవరైనా మందు దొరుకుతుందంటే చాలు పద్మవ్యూహం లాంటి పోలీసు తనిఖీలను దాటుకుంటూ వెళుతున్నారు.

news18-telugu
Updated: April 10, 2020, 6:42 PM IST
మీకు మద్యం కావాలా.. అయితే మాకు కాల్ చేయండి.. చేశారో ఇక మీ సంగతి అంతే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ వ్యాప్తి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. దీంతో మందుబాబులకు పెద్ద చిక్కు వచ్చి పడింది. మూడు పూటలా తిండి దొరక్క పోయినా ఫర్వాలేదు గానీ చీకటి పడగానే చుక్క నోట్లోకి వెళ్లకపోతే మాత్రం మందుబాబులకు ప్రాణం ఆగమాగమవుతోంది. దీంతో మందు కోసం ఏం చేసేందుకైనా సిద్ధమవుతున్నారు. మత్తుకు బానిసైన కొంతమంది రోజుల తరబడి మత్తు దొరక్క పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఎర్రగడ్డ ఆస్పత్రికి రోగుల తాకిడి విపరీతంగా పెరిగింది. అయితే రోజుల తరబడి ఇంట్లో ఖాళీగా ఉంటుండడం.. వేరే పని లేకపోవడంతో మందుబాబులకు చిర్రెత్తుకొస్తుంది. స్నేహితుడు ఎవరైనా మందు దొరుకుతుందంటే చాలు పద్మవ్యూహం లాంటి పోలీసు తనిఖీలను దాటుకుంటూ వెళుతున్నారు.

అయితే దీన్ని ఆసరాగా తీసుకుంటున్న కొంతమంది మోసగాళ్లు తమ బుర్రకు పని చెబుతున్నారు. మద్యం డోర్ డెలివరీ చేస్తామంటూ సోషల్ మీడియా ప్రచారం చేసుకుంటూ మందుబాబులను బురిడీ కొట్టిస్తున్నారు. కొంతమంది మద్యం దుకాణల పేరుతో తమ ఫోన్ నంబర్లను పెట్టి..ఫోన్ చేస్తే మద్యం డోర్ డెలివరీ చేస్తామంటూ నమ్మిస్తున్నారు. అందుకు కావాల్సిన మద్యం కోసం ముందే నగదు చెప్పాలని, డెబిట్ కార్డు ఇన్‌ఫర్మేషన్ చెప్పాలంటూ వివరాలు తీసుకుంటున్నారు. తీరా నగదు దోచుకుని మొహం చాటేస్తున్నారు. అప్పటికీ గానీ మందుబాబులకు తాము మోసపోయామని తెలియట్లేదు. ఇలాంటి విషయాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హైదరాబాద్ సిటీ పోలీసులు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Published by: Narsimha Badhini
First published: April 10, 2020, 6:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading