తెలంగాణ గోదావరి నదిలో కలుస్తున్న విషం... పొంచి ఉన్న ముప్పు

ఫ్యాక్టరీ యాజమాన్యం భారీ వర్షాలు వరదలు వచ్చే సమయంలో అదను చూసి గోదావరి నదిలో కలిపేస్తోoది. ఆ వ్యర్థాలు ఇప్పుడు బాసర లోని గోదావరి నది మీదుగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లోకి కలుస్తున్నాయి.

news18-telugu
Updated: September 8, 2019, 10:43 AM IST
తెలంగాణ గోదావరి నదిలో కలుస్తున్న విషం... పొంచి ఉన్న ముప్పు
గోదావరి నదిలో కలుస్తున్న విషం
  • Share this:
నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో అమ్మవారి పాదాల చెంత పవిత్రంగా పారే గోదావరి నదికి మహా సంకటం వచ్చి చేరింది.మహారాష్ట్ర లోని తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో గల ధర్మాబాద్ శివారులో గల పయనీర్ ఆల్కహాల్ ఫ్యాక్టరీలను వ్యర్థాలను అదనుచూసి వరద మాటున గోదావరి నదిలోకి కలుపుతున్నారు. ప్రతి సంవత్సరం ఇదే తంతు జరుగుతున్నా ఇరు రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మాత్రం ఘోరంగా విఫలమవుతున్నారు. గత సంవత్సరం కూడ ఇలాంటి సంఘటన జరిగితే పలు ఛానళ్ళు .. ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేయగా... మహా రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ద్వారా ఆల్కహాల్ ఫ్యాక్టరీకి నోటీసులు జారీ చేసిందని సమాచారం.

అప్పట్నుంచి రెండు నెలలు మూసి ఉండి తిరిగి మళ్ళీ ఆల్కహాల్ ఫ్యాక్టరీ యజమాన్యం తన రాజకీయ పలుకుబడితో తిరిగి ప్రారంభించింది. మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లో మహారాష్ట్ర భూభాగంలో గత పదేళ్ల క్రితం ప్రారంభమైన ఆల్కహాల్ ఫ్యాక్టరీలో తొలుత ముడిసరుకు మాత్రమే తయారయ్యేది ప్రస్తుతం ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఫ్యాక్టరీ ఇప్పుడు 100 ఎకరాలకు విస్తరించింది. ఆల్కహాల్ ను తయారు చేస్తోంది ఫలితంగా మొలాసిస్ ..బార్లీ ... ఇతర విష రసాయనాలు భారీగా ఉత్పత్తి అవుతున్నాయి. ఏడాది పొడవునా ఆ వ్యర్థాలను నిల్వ ఉంచి ఫ్యాక్టరీ యాజమాన్యం భారీ వర్షాలు వరదలు వచ్చే సమయంలో అదను చూసి గోదావరి నదిలో కలిపేస్తోoది. ఆ వ్యర్థాలు ఇప్పుడు బాసర లోని గోదావరి నది మీదుగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లోకి కలుస్తున్నాయి.

తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలే కాకుండా బాసర త్రిబుల్ ఐటీ లో విద్యనభ్యసించే సుమారు ఏడు వేలమంది విద్యార్థులు... నిజామాబాద్ జిల్లాలోని సుమారు 126 గ్రామాల ప్రజలు ఈ గోదావరి నది నీటిపై ఆధారపడి ఉన్నారు,కలుషిత మైన నది జలాల ధాటికి నదిలో ఉండే మత్స్య సంపదతో పాటు ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నదీ జలం యొక్క రంగు పూర్తిగా మారిపోయిందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.ఈ రసాయన విడుదలతో నదీ పరివాహక ప్రాంతంలోని పంటల దిగుబడి తగ్గి పోయి గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
First published: September 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading