LIQOUR SMUGGLING IN POLICE VEHCLE AP POLICE ARRESTED TS CONSTABLE VRY
Liqour smuggling : వాట్ ఏ డేర్.. పోలీస్ వెహికిల్‌లోనే అక్రమ మద్యం రవాణా.. రెడ్ హ్యండెడ్‌గా కానిస్టేబుల్
ప్రతీకాత్మక చిత్రం
Liqour smuggling : ఓ కానిస్టేబుల్ ఏకంగా పోలీస్ పెట్రోలింగ్ వాహనంలోనే మద్యాన్ని తెలంగాణ నుండి ఏపికి తరలిస్తూ.. పట్టుబడ్డాడు. సుమారు 5 లక్షల రూపాయల విలువైన మద్యంతోపాటు కానిస్టేబుల్‌ను ఏపి పోలీసులు అరెస్ట్ చేశారు.
కంచే.. చేను మేసిన చందంగా కొంతమంది తెలంగాణ పోలీసుల ( Telangana police ) తీరు ఉంటుంది. అక్రమార్కులకు అడ్డుకట్టవేయాల్సిన వారే, చేతులు కలిపి కటకటాలపాలవుతున్నారు. తెలంగాణ పోలీసుల పనితీరుపై ఓ వైపు దేశ వ్యాప్తంగా ప్రంశంసలు కురిపిస్తుంటే మరోవైపు కొద్దిమంది అధికారులు, పోలీసుల కానిస్టేబుల్స్ వల్ల ఆ డిపార్ట్మెంట్ పరువు పోతుంది. డబ్బులకు కక్కుర్తి పడి అక్రమార్కులకు సహకరిస్తున్నారు. ప్రభుత్వం మద్యం అక్రమా రవాణతోపాటు డ్రగ్స్ , గంజాయి మాఫియాను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించినా స్థానికంగా ఉండే పోలీసులు మాత్రం తమకేమి పట్టన్నట్టు వ్యవహరిస్తున్నారు. పైగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్రమ దందాలు నేరుగా చేయడంతోపాటు ఆ దందాలు చేసేవారికి డైరక్టుగా సహరిస్తున్నారు. ఇలా ఇటివల ఖమ్మంలో కొంతమంది పోలీసులు గంజాయి స్మగ్లింగ్‌లో రెడ్ హ్యండెడ్‌గా పట్టుపడగా.. తాజాగా మద్యన్ని పొరుగు రాష్ట్రానికి తరలిస్తూ అది కూడా ఏకంగా పోలీసు వాహనంలోనే తరలించడం సంచలనంగా మారింది.
ఈ క్రమంలోనే తాజాగా నల్గొండ జిల్లా (nalgonda ) వాడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పరిధిలోని అంతరాష్ట్ర సరిహధ్దు కావడంతో అక్కడ ఇతర రాష్ట్రాలకు వెళ్లే అక్రమ రవాణను అడ్డుకునేందుకు ఇటు తెలంగాణ, అటు ఆంధ్రా పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. దీంతో ఆ చెక్ పోస్టులను తప్పించుకుని కొంతమంది బడా వ్యాపారులు తెలంగాణ నుండి ఏపికి మద్యం అక్రమ రవాణ సరఫరా ( Liqour smuggling )చేస్తున్నారు. దీంతో సాధారణ వాహనంలో రవాణ వల్ల ఇబ్బందులు తలెత్తుతుండడంతో అక్రమదారులు బరి తెగించారు.. మద్యం రవాణ కోసం ఏకంగా పోలీసు వాహనంలోనే తరలిస్తే ఇంకెవరు పట్టుకుంటారనే సరికొత్త ప్లాన్‌కు తెరతీశారు. ఇందుకోసం పోలీసు పెట్రోలింగ్ చేసే కానిస్టేబుల్స్‌ను రంగంలోకి దింపి ఆ వాహనం ద్వారా మద్యాన్ని ఏపికి సరఫరా చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈనెల పద్నాల్గవ తేదీన అద్దంకి నార్కట్ పల్లి సరిహద్దు వద్ద ఓ మద్యంతో కూడిన పోలీసు వాహనం అటు ఇటు తిరుగుతోంది. అయితే పోలీసు వాహనం కావడంతో చెక్ పోస్టు వద్ద ఉన్న ఇరు రాష్ట్రాల పోలీసులు పట్టించుకోలేదు.. దీంతో మద్యంతో సరిహద్దు దాటిన పోలీసు వాహనం, ఏపిలోని దాచేపల్లి మండలం రామాపురం క్రాస్ రోడ్డు వద్ద మరో వాహనంలోకి మద్యాన్ని ( Liqour smuggling) తరలిస్తుండగా స్థానిక పోలీసులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో పోలీసు వాహనంలోని కానిస్టేబుల్ శ్రావన్‌కుమార్ తోపాటు అందులో ఉన్న సుమారు 5 లక్షల రూపాయల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకుని, స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.