Prof K Nageshwar: ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌కు ఫోన్‌లో బెదిరింపులు.. చంపేస్తామని వార్నింగ్

Prof K Nageshwar: తనకు బెదిరింపు కాల్స్ రావడంతో తాను హాక్ ఐ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలిపారు.

news18-telugu
Updated: August 6, 2020, 5:42 PM IST
Prof K Nageshwar: ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌కు ఫోన్‌లో బెదిరింపులు.. చంపేస్తామని వార్నింగ్
ప్రొఫెసర్ కె నాగేశ్వర్
  • Share this:
మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ విషయాన్ని ఆయన ధృవీకరించారు. జులై 25న తనకు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయాన్ని ఆయన అంగీకరించారు. ఆయన ఉదయం ఒక ఫోన్ కాల్ వచ్చిందని.. అవతలి వ్యక్తి బూతులు తిడుతూ మాట్లాడాడని ఆయన తెలిపారు. తనను చంపేస్తానని ఆ వ్యక్తి బెదిరించాడని నాగేశ్వర్ వెల్లడించారు. ఆ రోజు ఈ రకమైన కాల్స్ దాదాపు ఎనిమిది వరకు వచ్చాయని... ఆ తరువాత తాను ఆ కాల్స్ లిఫ్ట్ చేయలేదని అన్నారు. బెదిరింపు కాల్స్ రావడంతో తాను హాక్ ఐ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆయన తెలిపారు.

ఇక యూట్యూబ్‌లో తన పేరు మీద ఓ ఛానల్ పెట్టుకున్న నాగేశ్వర్.. తన అభిప్రాయాలను, విశ్లేషణలను ఈ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు వీక్షకులకు అందిస్తుంటారు. అనేక అంశాలపై సుదీర్ఘమైన, అర్థవంతమైన విశ్లేషణలు చేస్తుంటారు.
Published by: Kishore Akkaladevi
First published: August 6, 2020, 5:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading