Home /News /telangana /

LIFE THREAT TO RAJA SINGH IN CHERLAPALLY CENTRAL JAIL HIS WIFE MOVES TO HIGH COURT RAJA SINGH SLOGANS IN BANDI SANJAY MEETING SK

Raja Singh: బండి సంజయ్ సభలో రాజాసింగ్ నినాదాలు.. జైల్లో ప్రాణహాని.. హైకోర్టుకు భార్య

Raja singh: స్టేజిపై బీజేపీ నేతలు ప్రసంగిస్తున్న సమయంలో.. అభిమానులు, పార్టీ కార్యకర్తలు.. రాజాసింగ్.. రాజాసింగ్ అంటూ నినాదాలు చేశారు. రాజాసింగ్ ఎక్కడ అంటూ గట్టి అరిచారు. రాజాసింగ్‌పై మాట్లాడాలని డిమాండ్ చేశారు.

Raja singh: స్టేజిపై బీజేపీ నేతలు ప్రసంగిస్తున్న సమయంలో.. అభిమానులు, పార్టీ కార్యకర్తలు.. రాజాసింగ్.. రాజాసింగ్ అంటూ నినాదాలు చేశారు. రాజాసింగ్ ఎక్కడ అంటూ గట్టి అరిచారు. రాజాసింగ్‌పై మాట్లాడాలని డిమాండ్ చేశారు.

Raja singh: స్టేజిపై బీజేపీ నేతలు ప్రసంగిస్తున్న సమయంలో.. అభిమానులు, పార్టీ కార్యకర్తలు.. రాజాసింగ్.. రాజాసింగ్ అంటూ నినాదాలు చేశారు. రాజాసింగ్ ఎక్కడ అంటూ గట్టి అరిచారు. రాజాసింగ్‌పై మాట్లాడాలని డిమాండ్ చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    సరిగ్గా నెల రోజుల క్రితం తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) రాజాసింగ్ (Raja Singh) చుట్టూనే తిరిగాయి. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ముస్లిం సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి. ఈ క్రమంలో ఆయనపై పీడీ యాక్ట్ పెట్టి... చర్లపల్లి జైలులో ఉంచారు.  ఆయన జైలుకు వెళ్లిన తర్వాత.. బీజేపీలో ఏ ఒక్కరూ స్పందించలేదు. రాజాసింగ్‌కు మద్దతుగా మాట్లాడలేదు. ఈ క్రమంలో గురువారం బండి సంజయ్ (Bandi Sanjay) మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో రాజాసింగ్ పేరు మార్మోగిపోయింది. స్టేజిపై బీజేపీ నేతలు ప్రసంగిస్తున్న సమయంలో.. అభిమానులు, పార్టీ కార్యకర్తలు.. రాజాసింగ్.. రాజాసింగ్ అంటూ నినాదాలు చేశారు. రాజాసింగ్ ఎక్కడ అంటూ గట్టి అరిచారు. రాజాసింగ్‌పై మాట్లాడాలని డిమాండ్ చేశారు. వెంటనే బండి సంజయ్ కలగజేసుకొని.. వాళ్లని సముదాయించారు. తాము జైలుకు భయపడే వ్యక్తులం కాదని అన్నారు. జైలుకు పంపిన వారిని, కుట్రపన్నిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.  అనంతరం సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడారు. మరోవైపు చర్లపల్లి జైలులో రాజాసింగ్‌కు ప్రాణహాని ఉందని ఆయన భార్య ఉషాబాయి సంచలన ఆరోపణలు చేశారు.ఆయనకు ప్రత్యేక భద్రత కల్పించాలని కోరుతూ హైకోర్టు(Telangana High court)లో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ప్రిజన్ రూల్స్ కింద స్పెషల్ క్లాస్ సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాజాసింగ్ జైల్లో ఉన్నప్పటికీ.. ఇప్పటికీ ఆయన ఎమ్మెల్యేనని అన్నారు. ఆయన్ను కలిసేందుకు నియోజక ఓటర్లు, పౌరుల ములాఖత్‌కు జైలు అధికారులు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో కీలకంగా వ్యవహరించే చట్ట సభ్యులను కలుసుకునేం హక్కు ప్రజలకు ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రిజన్ యాక్ట్-1894, తెలంగాణ ప్రిజన్ రూల్స్ ప్రకారం.. ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్.. కొన్ని ప్రత్యేకమైన సౌకర్యాలను పొందేందుకు అర్హుడని ఆమె కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కనీస సౌకర్యాలైన టేబుల్, బెడ్, కుర్చీతో పాటు పుస్తకాలు, వార్తా పత్రికలు అందజేయాలని కోరారు. రాజాసింగ్‌పై ఇంకా ఆరోపణలు రుజువు కాలేదని.. అందువల్ల ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన భార్య ఉషాబాయి విజ్ఞప్తి చేశారు. అంతేకాదు సాధారణ దుస్తులు ధరించేందుకు అనుమతించాలని కోరారు. ఆయనకు ప్రాణహాని కూడా ఉందని.. అందువల్ల నేరం రుజువై శిక్ష అనుభవిస్తున్న నేరస్తుల నుంచి.. దూరంగా ఉంచాలని అన్నారు. ఉషాబాయి దాఖలు చేసిన ఈ పిటిషన్‌ గురువారం జస్టిస్ కే. లలిత ధర్మాసనం ముందుకు వచ్చింది. ఐతే సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించేందుకు సమయం ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరడంతో.. వచ్చే వారానికి విచారణ వాయిదా పడింది. పీడీ యాక్ట్ కింద ఆయన్ను అరెస్ట్ చేయడంపై ఇప్పటికే ఆమె పిటిషన్‌ను దాఖలు చేశారు. అది కూడా పెండింగ్‌లో ఉంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bandi sanjay, Bjp, Raja Singh, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు