Home /News /telangana /

LIFE IMPRISONMENT TO ACCUSED WHO FIRED IN CHILDREN FIGHTING IN ADILABAD LAST YEAR VRY

Telangana News : క్రికెట్ ఆటలో పిల్లల ఘర్షణ, కాల్పులు జరిపిన ఓ పార్టీ జిల్లా అధ్యక్షుడు..

శిక్ష పడ్డ ఎంఐఎం నేత

శిక్ష పడ్డ ఎంఐఎం నేత

Telangana News : ఇద్దరు పిల్లల మధ్య జరిగిన ఘర్షణలో తలదూర్చిన ఓ తండ్రి తన కొడుకును తిట్టిని పిల్లాడిపై ఏకంగా కాల్పులు జరిపాడు.. ఆ తర్వాత బాలుడు చనిపోవడంతో నిందితునికి యావజ్జీవ శిక్ష పడింది.

    గోటితో పోయోదానికి గొడ్డలి వరకు తెచ్చుకున్నాడు ఓ తండ్రి పిల్లల గొడవల్లో తలదూర్చి తన కొడుకు తిట్టినందుకు మరో పిల్లాడి ప్రాణాలు తీశాడు.. చివరకు నరకయాతన అనుభవించి, తాను చేసిన తప్పును తెలుసుకుని జైల్లోనే ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే తోటి ఖైదీలు కాపాడడంతో ఆ కేసు కాస్త ట్రయల్‌కు నేడు తీర్పు వెలువడింది. నిందితుడికి జీవిత ఖైదు విధించింది. కాగా ఆ శిక్ష పడ్డ నిందితుడు ఓ జాతీయ పార్టీకి జిల్లా అధ్యక్షుడు కూడా కావడం విశేషం.

    వివరాల్లోకి వెళితే.. 2019లో డిసెంబర్ 18న పిల్లల మధ్య క్రికెట్ వివాదం చెల రేగింది. అది కాస్తా.. తీవ్ర ఘర్షణలకు దారి తీసింది. ఈ ఘర్షణలో తన కుమారుడిని తిట్టాడని జమీర్​ అనే మరో వ్యక్తిపై ఫారూఖ్ అహ్మద్ అనే వ్యక్తి కాల్పులు జరిపారు. కాల్పుల్లో గాయపడిన సయ్యద్ జమీర్.. చికిత్స పొందుతూ గత ఏడాది డిసెంబర్ 26వ తేదీన మృతి చెందారు. దీంతో ఫారూఖ్ అహ్మాద్‌ను జూడియల్ రిమాండ్‌కు తరలించారు.. దీంతో గతేడాది మార్చి 24న జిల్లా జైలులో ఫారూఖ్ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా.. తోటి ఖైదీలు అతడిని కాపాడారు... కాగా హత్య కేసుకు సంబంధించి త్వరగా విచారణ జరిపేందుకు గతేడాది మార్చి 19న ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

    Khammam : అక్క, బావ వేధింపులు భరించలేను.. నేను చనిపోతా.. సీఎంకు సెల్ఫీ వీడియో..

    కేసును విచారణ చేసిన ప్రత్యేక కోర్టు ఫారూఖ్​కు జీవిత ఖైదుతో పాటు రూ.12వేల జరిమానా విధించింది. ఏ-2, ఏ-3లను నిర్దోషులుగా ప్రకటించింది. జైలు శిక్ష పడ్డ నిందితుడు ఫారూఖ్‌ ఆదిలాబాద్ జిల్లా ఎంఐఎం అధ్యక్షుడుగా పని చేశాడు.. ఆ సమయంలోనే ఈ వివాదం చెలరేగింది.

    Hyderabad : పెళ్లి కావడం లేదని పురోహితుడి వద్దకు వెళితే.. తానే పెళ్లి చేసుకుంటానని..

    భార్యను కొట్టి చంపిన భర్త

    మరోవైపు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాల పట్టణ సమీపంలోని నస్పూర్ మండలం తీగల పహాడ్ గ్రామంలో విజయ్ అనే భర్త ఆయన భార్యతో ఘర్షణల్లో ఆమెను నిన్న అర్థరాత్రి దారుణంగా కొట్టాడు. దీంతో ఆ దెబ్బలకు తాళలేక మృతి చెందింది. తన దెబ్బలకు భార్య చనిపోవడంతో విజయ్ నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లోంగిపోయాడు. కాగా విజయ్ లారీ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడని పోలీసులు తెలిపారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Adilabad, Crime

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు