హోమ్ /వార్తలు /తెలంగాణ /

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టు ర‌న్ వేపై చిరుత‌.. అప్రమత్తమైన భ‌ద్ర‌తా అధికారులు

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టు ర‌న్ వేపై చిరుత‌.. అప్రమత్తమైన భ‌ద్ర‌తా అధికారులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో గత కొన్ని రోజులుగా చిరుత పులుల సంచారం ఎక్కువైంది. చిరుత పులులు వనాలు విడిచి రోడ్లపైకి వచ్చేస్తున్నాయి.

తెలంగాణలో గత కొన్ని రోజులుగా చిరుత పులుల సంచారం ఎక్కువైంది. చిరుత పులులు వనాలు విడిచి రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. రాష్ట్రంలో నిత్యం ఏదో ఓ చోట చిరుత పులి సంచారం గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా శంషాబాద్ పరిసరాల్లో చిరుత సంచారం కలకలం రేపింది. ఆదివారం అర్ధరాత్రి శంషాబ్ ఎయిర్‌పోర్ట్‌లోని రన్‌ వేపై చిరుత సంచరింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. 10 నిమిషాల పాటు ఎయిర్‌పోర్ట్ రన్‌వేపై తిరగాడిన చిరుతు.. ఆ తర్వాత చిరుత రషీద్‌గూడ వైపు గోడ దూకి వెళ్లింది. ఎయిర్‌పోర్ట్ రన్‌వే పై చిరుత సంచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

చిరుత సంచారం నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. శంషాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇక, చిరుత సంచారం వార్తలతో సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.


ఇక, కొన్ని నెలల కిందట రాజేంద్ర నగర్ ప్రాంత వాసులను ఓ చిరుత దాదాపు ఆరు నెలల పాటు కలవరానికి గురిచేసిన సంగతి తెలిసిందే. రాత్రి వేళ్లల్లో ఆవులు, దూడలపై చిరుత దాడులు చేయడం స్థానికంగా కలవరం రేపింది. రోడ్డుపైకి రావడం.. ఆ తర్వాత క్షణాల్లోనే అటవీ ప్రాంతాల్లోకి పారిపోవడంతో దాన్ని కనిపెట్టం అధికారులు ఇబ్బందికరంగా మారింది. దీంతో స్థానికంగా ఉండే ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు. మరోవైపు చిరుత ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. పలుచోట్ల ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేశారు. దాదాపు ఆరు నెలల తర్వాత గతేడాది అక్టోబర్‌లో అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించారు. అనంతరం దానిని నగరంలోని నెహ్రూ జూపార్క్‌కు తరలించారు.

First published:

Tags: Hyderabad, Leopard, Shamshabad Airport

ఉత్తమ కథలు