హైదరాబాద్ శివారుల్లో చిరుతపులి... భయం గుప్పిట్లో జనం

ఇంటి డాబాపై చిరుత

అర్ధరాత్రి దాటిన తర్వాత స్థానిక పటేల్ రోడ్డుకు చేరుకున్న చిరుతపులి మన్నే విజయ్ కుమార్ అనే వ్యక్తి ఇంటిపై సేద తీరుతుంది.

 • Share this:
  హైదరాబాద్ శివారుల్లో చిరుత పులి హాల్ చల్ చేసింది. ఏకంగా జనావాసాల్లోకి  చిరుత ప్రవేశించింది.ఓ ఇంటి డాబామీద ఎక్కి... పూల కుండీల మధ్య దాక్కొంది. దీంతో అది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

  చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు


  రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని పటేల్ రోడ్డులో చిరుత పులి కలకలం రేపింది.  అర్ధరాత్రి దాటిన తర్వాత స్థానిక పటేల్ రోడ్డుకు చేరుకున్న చిరుతపులి మన్నే విజయ్ కుమార్ అనే వ్యక్తి ఇంటిపై సేద తీరుతుంది. పక్కనే కమ్మదనం అటవీక్షేత్రం ఉంది. చాలా రోజులుగా చిరుతపులి సంచరిస్తుందని అక్కడ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అదిగో పులి ఇదిగో పులి అన్నట్టు మాత్రమే అందరూ అనుకున్నారు. కానీ నిజంగా చిరుతపులి షాద్ నగర్ పట్టణంలోని నగర నడిబొడ్డులో ప్రత్యక్షం కావడంతో జనం భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. విజయ్ కుమార్ ఇంటి పైన ఎలా చేరిందో తెలియదు కానీ దాబా పై తీరిగ్గా నిద్రిస్తుంది.

  ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. షాద్ నగర్ ఏసీపీ సురేందర్, పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీధర్ కుమార్, ఎస్ఐ కృష్ణ, విజయ భాస్కర్ రెడ్డి తదితర సిబ్బంది పటేల్ రోడ్డుకు చేరుకున్నారు. చిరుత పులిని చూడడానికి జనాలు ఎగబడ్డారు పటేల్ రోడ్డులో భయానక వాతావరణం నెలకొంది. పోలీసులు జనాలను కంట్రోల్ చేస్తున్నారు. ఏసిపి సురేందర్ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. మరికొద్ది సేపట్లో ఫారెస్ట్ అధికారులు రాబోతున్నారు. చిరుతపులి నిద్రొస్తోంది కాబట్టి ఎవరికీ ఏ హానీ జరగలేదు. పోలీసులు పూర్తి జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. జనాలను రానివ్వకుండా ఆంక్షలు విధించారు.

  Published by:Sulthana Begum Shaik
  First published: