Telangana Viral Video: వ్యాక్సిన్ తీసుకోకుంటే.. తట్టా బుట్టా సర్దుకోని ఊరు విడిచి వెళ్లాల్సిందే.. వీడియో వైరల్..

కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని దండోరా వేస్తున్న గ్రామస్తుడు

Telangana Viral Video: వ్యాక్సిన్ పై అపోహలు నమ్ముతూ దానికి దూరంగా ఉంటున్నారు కొంతమంది. అయితే ఇలా వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలంగాణలోని ఓ గ్రామంలో దండోరా వేయించారు. అతడు అందరూ టీకాలు వేయించుకోవాలి.. లేదంటే ఊరి నుంచి వెళ్లిపోవాలి అంటూ అతడు చెప్పే విధానం నెటిజన్లను ఆకర్శించింది.

  • Share this:
    కరోనా మహమ్మారి(Corona) రెండు వేవ్(Second Wave) లతో ప్రతీ ఒక్కరినీ భయభ్రాంతులకు గురిచేసింది. సెకండ్ వేవ్ ముగిసింది. కానీ మూడో వేవ్ ముప్పు పొంచి ఉందంటూ వైద్యులు(Doctors) హెచ్చరిస్తున్నారు. అయితే కరోనా వైరస్ నుంచి తమను తాము రక్షించుకోవాలంటే.. తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని మొదటి నుంచి వైద్యులు చెబుతూనే ఉన్నారు. ఇప్పటికే చాలామంది ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు. మరికొంత మంది అపోహలు నమ్ముతూ దానికి దూరంగా ఉంటుంన్నారు. అయితే ఇలా వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలంగాణలోని ఓ గ్రామంలో దండోరా వేయించారు. అతడు అందరూ టీకాలు వేయించుకోవాలి.. లేదంటే ఊరి నుంచి వెళ్లిపోవాలి అంటూ అతడు చెప్పే విధానం మంచిగా అనిపించింది.

    Pregnant Women: కరోనా వైరస్‌తో గర్భిణీలకు ముప్పే.. ఐసీఎంఆర్ అధ్యయనంలో షాకింగ్ నిజాలు..


    ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అతడు దండోరా వాయిస్తూ ఇలా చెప్పాడు.. ‘‘ఇళ్లల్లో ఉండే వాళ్లు వినండి.. కంట్రోల్ బియ్యం బంద్.. పింఛన్ బంద్.. నిత్యావసర సరుకులు.. నీళ్లు బందు.. కరోనా సూదుల ఎవరైతే వేసుకోలేదో వాళ్లకు.. వేసుకుంటేనే ఇవన్నీ సప్లై .. లేకపోతే తట్టా బుట్టా సదురుకొన పక్కకు జరగాలి.. ఊళ్లో కనిపించొద్దు.. ఇది గ్యాంరెంటీ అయిన విషయం.. కంపల్ సరిగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని’’.. అతడు దండోరా వేస్తూ ఊరు జనాలకు చెప్పాడు. ఇలా ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఆవశ్యకతపై అతడు చెప్పే విధానం నెటిజన్లకు తెగ నచ్చేసింది. దీనికి సంబంధించి వీడియో వైరల్ గా మారింది.


    ఇటీవల కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని అవగాహన కార్యక్రమాలు విపరీతంగా చేపడుతున్నారు. అందులో ఒకరు ఆటోలో తిరుగుతూ ప్రచారం చేస్తుంటే.. కొంతమంది సైకిల్ పై కరపత్రాలు పంచుతూ అవగాహన కల్పిస్తున్నారు. మరికొన్ని ఊళ్లల్లో వ్యాక్సిన్ తీసుకోకుంటే కంట్రోల్ బియ్యం బంద్ చేస్తారంటూ అవగాహన కల్పించిన ఘటనలు కూడా ఉన్నాయి.

    Vaccination Effects: కరోనా టీకాతో రుతుక్ర‌మంలో మార్పులు వస్తాయా..? నిపుణులు ఏం చెబుతున్నారు..


    అయితే ఈ వీడియో ఏ గ్రామంలో జరిగిందో తెలియదు కానీ.. అతడు కరోనా వ్యాక్సిన్ తీసుకోకపోతే ఊరు వదిలి వెళ్లిపోవంటూ అనడం నెటిజన్లను ఆకర్తిస్తోంది. దీనిపై నెటిజన్లు కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. అవును.. అలానే చేయాంటూ.. చెబుతున్నారు.
    Published by:Veera Babu
    First published: