హోమ్ /వార్తలు /తెలంగాణ /

MLC elections :ఎమ్మెల్సీ ఎన్నికల్లో సవాళ్లను నిలబెట్టుకున్న ఆ... నేతలు.. ?

MLC elections :ఎమ్మెల్సీ ఎన్నికల్లో సవాళ్లను నిలబెట్టుకున్న ఆ... నేతలు.. ?

MLC elections : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీల నేతలు చేసిన సవాళ్లను నిలబెట్టుకున్నారు. తమ పార్టీకి ఇన్ని ఓట్లు రాకపోతే రాజీనామా చేస్తామంటూ సవాళ్లు విసిరారు. అందుకు అనుగుణంగానే ఓట్లు రాబట్టుకున్నారు.

MLC elections : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీల నేతలు చేసిన సవాళ్లను నిలబెట్టుకున్నారు. తమ పార్టీకి ఇన్ని ఓట్లు రాకపోతే రాజీనామా చేస్తామంటూ సవాళ్లు విసిరారు. అందుకు అనుగుణంగానే ఓట్లు రాబట్టుకున్నారు.

MLC elections : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీల నేతలు చేసిన సవాళ్లను నిలబెట్టుకున్నారు. తమ పార్టీకి ఇన్ని ఓట్లు రాకపోతే రాజీనామా చేస్తామంటూ సవాళ్లు విసిరారు. అందుకు అనుగుణంగానే ఓట్లు రాబట్టుకున్నారు.

  తాజాగా జరిగిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ( MLC elections )అధికార పార్టీ టీఆర్ఎస్ ( TRS ) అతి సులువుగా గెలిచే అవకాశాలు ఉన్నా పోటి రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే పోటి అనివార్యమయింది. ముఖ్యంగా తమ పార్టీ అభ్యర్థులను కాపాడుకోవడంతో పాటు టీఆర్ఎస్ పార్టీకి పూర్తిస్థాయిలో ఏకగ్రీవం అయ్యెందుకు అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ పావులు కదిపింది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం , మెదక్ జిల్లాల్లోని ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపింది.( MLC elections ) దీనికి తోడు మరికొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్ధులు సైతం తమ బలాన్ని నిరూపించుకునేందుకు రంగంలోకి దిగారు.

  ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీతో పాటు టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఇండిపెండెంట్ అభ్యర్థి సర్థార్ రవీందర్ సింగ్ బరిలో నిలిచారు. ( Ravinder sing ) అయితే ఇలా కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థి పోటిలో ఉన్న స్థానాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు సవాళ్లు విసురుకున్నారు. ( MLC elections )తమకు ఇన్ని ఓట్లు వస్తాయని ముందే చెప్పుకున్నారు. ఒకవేళ అవి రాకపోతే.. రాజీనామా చేస్తామనడంతో ఇతర వ్యాఖ్యలు చేశారు...

  ఈ క్రమంలోనే కరీంనగర్ ( karimnagar ) జిల్లాలో రెబల్ అభ్యర్థిగా సర్థార్ రవీందర్ సింగ్ పోటిలో ఉండడంతో ఆ జిల్లా నేతలు ముఖ్యంగా మంత్రి గంగుల కమాలాకర్‌తో పార్టీ అభ్యర్థులు, సభ్యులను సైతం నామినేషన్ ధాఖలు చేసిన రోజే క్యాంపు రాజకీయాలకు తెర తీశారు. దీంతో ఇండిపెండెంట్ అభ్యర్థి కనీసం వారిని కలిసి ఓటును అభ్యర్థించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ( karimnagar ) ఈ క్రమంలోనే మంత్రి గంగుల కమలాకర్ ( Gangula kamalaker ) పోలింగ్ జరిగిన రోజునే ఓ సవాల్ విసిరారు. తమ పార్టీ అభ్యర్థులకు 986 ఓట్ల కంటే తక్కువ వచ్చినట్టయితే... టీఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణ లేనట్టేనని బహిరంగ సవాల్ విసిరారు. అంటే అంతకు తక్కువ ఓట్లు రావని స్పష్టంగా చెప్పారు.

  కాగా నేడు ఫలితాల నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఆ పార్టీ నుండి పోటిలో నిలిచిన భానుప్రకాశ్ రావుతోపాటు ఎల్. రమణలు విజయం సాధించారు. భానుప్రకాశ్ రావుకు 585 ఓట్లు , రాగా ఎల్ రమణకు 479 ,ఓట్లు పోలు కాగా, రవీందర్ సింగ్‌కు 232 ఓట్లు పోలయ్యాయి.అంటే మంత్రి గంగుల సవాల్ చేసినట్టుగా ఆపార్టీకి ఆయన అంచనా వేసిన వాటికంటే అదనంగా 78 ఓట్లు అదనంగా వచ్చాయి.

  Breaking : ఇప్పుడు ఓకే... గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా సిరికొండ మధుసూదనా చారి..


  మరోవైపు ప్రతిపక్ష పార్టీకి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ( Jaggareddy ) చేసిన సవాల్‌ను సైతం ఆయన నిలబెట్టుకున్నారు.. ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఆయన సతీమణిని రంగంలోకి దింపారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 230 ఓట్లకంటే తక్కువ వచ్చినట్టైతే.. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ గెలవకపోయినా... తమ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు రంగంలోని దిగామని చెప్పారు. ఇక ఆయన చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 238 ఓట్లు సాధించింది. అంటే జగ్గారెడ్డి సవాల్ విసిరిన దానికంటే 8 ఓట్లు అదనంగా సాధించింది.


  mlc elections : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ హావా... గెలిచిన అభ్యర్థులు వీరే...

  ఇక ఖమ్మంలో ఇదే పరిస్థితి కనిపించింది. అక్కడ సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ( Bhatti vikramarka ) తన పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు. ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న సుమారు 100 ఓట్ల కంటే అందనంగా మరో 140 ఓట్లు సాధించారు. దీంతో అధికార పార్టీ నుండి ఓట్లు చీలాయి అన్నది నిజం.. మొత్తం మీద రెండు చోట్ల పోటిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో ఓట్లను సాధించి చేసిన సవాళ్లును నిలబెట్టుకుందని చెప్పవచ్చు..

  Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News

  First published:

  Tags: Mlc elections, Telangana

  ఉత్తమ కథలు