Eetala Rajender : హుజురాబాద్‌లో ఆ.. ఒక్క చాన్స్ కోసం నేతల ఎదురు చూపులు..!

ఈటల రాజేందర్ (ఫైల్)

కరీంనగర్ జిల్లా.. న్యూస్ 18తెలుగు కరస్పాండెంట్. శ్రీనివాస్. పి తెలంగాణ రాజకీయాలన్ని కొన్ని రోజులుగా హుజురాబాద్ నియోజకవర్గంతోపాటు ఈటల రాజేందర్, చుట్టే తిరుగుతున్నాయి . కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన రాజేందర్ .. తన భవిష్యత్ కార్యాచరణ కోసం కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు . ఈ నేపథ్యంలోనే ఈటల కొత్త పార్టీ పెడతారనే ప్రచారం జోరుగా సాగుతుండగానే ... కొత్త వాదనలు తెరపైకి వస్తున్నాయి .ఈటల రాజేందర్ కు బీజేపీ నుంచి ఆహ్వానం వచ్చిందనే చర్చ రెండు రోజులుగా హోరెత్తుతుండగా . బీజేపీ జాతీయ నేత హైదరాబాద్ వచ్చి ఈటలతో చర్చలు జరిపారని, అలాగే బీజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈటెల విషయం లో క్లారిటీ కూడా ఇచ్చాడని తెలుస్తోంది .ఈటలను పార్టీలోకి ఆహ్వానించడంతో పాటు ఆయనకు కొన్ని హామీలు కూడా ఇచ్చారని చెబుతున్నారు . దీంతో ఈటల బీజేపీలో చేరిక ఖాయమైందని కూడా కొందరు ప్రచారం చేశారు . బీజేపీలో చేరుతున్నారన్న వార్తలపై ఈటల స్పందించకపోవడంతో సమావేశం జరిగింది నిజమేనని తెలుస్తోంది . ఇది ఇలా ఉంటే హుజూరాబాద్ కేంద్రంగా క్రమంగా రంగులు మారే రాజకీయం కనిపిస్తోంది . ఇప్పటికే గత కొన్నాళ్లుగా ఈటలకు జై కొట్టిన తెరాస ప్రజా ప్రతినిధుల్లో ఎక్కువ మంది తిరిగి గులాబీ గూటికి చేరారు . తెరాస పక్షాన చేరిన కొందరు మళ్లీ ఈటల వైపున నిలబడ్డారు . ఇలా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు అనేలా ఇక్కడి రాజకీయరంగులు తారుమారవుతున్నాయి . ఈ పరిణామాలతో భవిష్యత్తులో ఈ జంపింగ్‌లు మరింతగా పెరిగే అవకాశం ఉందనే భావనను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు . తాజాగా భాజపా నుంచి మాజీ మంత్రి పెద్ది రెడ్డి, కాంగ్రెస్ నుండి కౌశిక్ రెడ్డి,ఇంకా కొంతమంది టీఆరెఎస్ లోకి వస్తున్నట్లు ఇప్పటికే టీఆరెఎస్ పార్టీకి సంకేతాలు అందాయని అలాగే శుక్రవారంహుజురాబాద్ 11వార్డు కౌన్సిలర్ శోభ, తో పాటు మరికొందరు, తెరాస పార్టీకి లోకి రావడం మొదలవడంతో సమీప భవిష్యత్తులో జరిగే రాజకీయ పరిణామాలపై జోరైన చర్చ జరుగుతోంది. మరోవైపు మాజీ మంత్రి , ఉద్యమ నేత ఈటెల భాజపాలో చేరితే తమ బలం మరింతగా పెరుగుతుందనే ధీమాలో కమలనాథులున్నారు . ఆయన పార్టీలో చేరిన తరువాత తెరాస సహా ఇతర పార్టీల నుంచి పెద్దఎత్తున తమ పక్షాన చేరే నాయకుల సంఖ్య పెరుగుతుందనే ఆశాభావాన్ని ఆయన మద్దతుదారులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈటెల బీజీపీ లోకి వెళ్తే తమకు ఎన్నొ రోజులుగా ఎదిరి చూస్తున హుజురాబాద్ ఎమ్మెల్యే టికెట్ సాధించే అవకాశం వస్తుందని ఇప్పటికి పలు నేతలు ఎదురు చూస్తున్నారు. కాని టీఆర్ఎస్ తరుపున ఇప్పటికి 6సార్లు ఎమ్మెల్యే గా గెలిచినా ఈటెలకు హుజురాబాద్ లో తిరుగు లేకుండా పోయిందని భావిస్తున్నారు. ఇప్పడు ఈటెల బీజీపీ లోకి వెళ్తే తమకు టీఆరెఎస్ పార్టీ నుండి టికెట్ వస్తుందని ఆశావహులు కూడ అదే తరహాలో ఎదురుచూస్తున్నారు.

  • Share this:
    కరీంనగర్ జిల్లా..
    న్యూస్ 18తెలుగు కరస్పాండెంట్. శ్రీనివాస్. పి
    తెలంగాణ రాజకీయాలన్ని కొన్ని రోజులుగా హుజురాబాద్ నియోజకవర్గంతోపాటు ఈటల రాజేందర్, చుట్టే తిరుగుతున్నాయి . కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన రాజేందర్ .. తన భవిష్యత్ కార్యాచరణ కోసం కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు . ఈ నేపథ్యంలోనే ఈటల కొత్త పార్టీ పెడతారనే ప్రచారం జోరుగా సాగుతుండగానే ... కొత్త వాదనలు తెరపైకి వస్తున్నాయి .ఈటల రాజేందర్ కు బీజేపీ నుంచి ఆహ్వానం వచ్చిందనే చర్చ రెండు రోజులుగా హోరెత్తుతుండగా . బీజేపీ జాతీయ నేత హైదరాబాద్ వచ్చి ఈటలతో చర్చలు జరిపారని, అలాగే బీజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈటెల విషయం లో క్లారిటీ కూడా ఇచ్చాడని తెలుస్తోంది .ఈటలను పార్టీలోకి ఆహ్వానించడంతో పాటు ఆయనకు కొన్ని హామీలు కూడా ఇచ్చారని చెబుతున్నారు . దీంతో ఈటల బీజేపీలో చేరిక ఖాయమైందని కూడా కొందరు ప్రచారం చేశారు . బీజేపీలో చేరుతున్నారన్న వార్తలపై ఈటల స్పందించకపోవడంతో సమావేశం జరిగింది నిజమేనని తెలుస్తోంది .

    ఇది ఇలా ఉంటే హుజూరాబాద్ కేంద్రంగా క్రమంగా రంగులు మారే రాజకీయం కనిపిస్తోంది . ఇప్పటికే గత కొన్నాళ్లుగా ఈటలకు జై కొట్టిన తెరాస ప్రజా ప్రతినిధుల్లో ఎక్కువ మంది తిరిగి గులాబీ గూటికి చేరారు . తెరాస పక్షాన చేరిన కొందరు మళ్లీ ఈటల వైపున నిలబడ్డారు . ఇలా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు అనేలా ఇక్కడి రాజకీయరంగులు తారుమారవుతున్నాయి . ఈ పరిణామాలతో భవిష్యత్తులో ఈ జంపింగ్‌లు మరింతగా పెరిగే అవకాశం ఉందనే భావనను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు .

    తాజాగా భాజపా నుంచి మాజీ మంత్రి పెద్ది రెడ్డి, కాంగ్రెస్ నుండి కౌశిక్ రెడ్డి,ఇంకా కొంతమంది టీఆరెఎస్ లోకి వస్తున్నట్లు ఇప్పటికే టీఆరెఎస్ పార్టీకి సంకేతాలు అందాయని అలాగే శుక్రవారంహుజురాబాద్ 11వార్డు కౌన్సిలర్ శోభ, తో పాటు మరికొందరు, తెరాస పార్టీకి లోకి రావడం మొదలవడంతో సమీప భవిష్యత్తులో జరిగే రాజకీయ పరిణామాలపై జోరైన చర్చ జరుగుతోంది. మరోవైపు మాజీ మంత్రి , ఉద్యమ నేత ఈటెల భాజపాలో చేరితే తమ బలం మరింతగా పెరుగుతుందనే ధీమాలో కమలనాథులున్నారు . ఆయన పార్టీలో చేరిన తరువాత తెరాస సహా ఇతర పార్టీల నుంచి పెద్దఎత్తున తమ పక్షాన చేరే నాయకుల సంఖ్య పెరుగుతుందనే ఆశాభావాన్ని ఆయన మద్దతుదారులు వ్యక్తం చేస్తున్నారు.

    అయితే ఈటెల బీజీపీ లోకి వెళ్తే తమకు ఎన్నొ రోజులుగా ఎదిరి చూస్తున హుజురాబాద్ ఎమ్మెల్యే టికెట్ సాధించే అవకాశం వస్తుందని ఇప్పటికి పలు నేతలు ఎదురు చూస్తున్నారు. కాని టీఆర్ఎస్ తరుపున ఇప్పటికి 6సార్లు ఎమ్మెల్యే గా గెలిచినా ఈటెలకు హుజురాబాద్ లో తిరుగు లేకుండా పోయిందని భావిస్తున్నారు. ఇప్పడు ఈటెల బీజీపీ లోకి వెళ్తే తమకు టీఆరెఎస్ పార్టీ నుండి టికెట్ వస్తుందని ఆశావహులు కూడ అదే తరహాలో ఎదురుచూస్తున్నారు.
    Published by:yveerash yveerash
    First published: