Home /News /telangana /

LAWYER VAMAN RAO FATHER KISHAN RAO ALERT HIM FEW HOURS BEFORE THE MURDER FULL DETAILS HERE HSN

Lawyer Vaman Rao Murder Case: ఫోన్ చేసి నేను ముందే చెప్పా.. సంచలన విషయాలు వెల్లడించిన వామన్ రావు తండ్రి

తండ్రి కిషన్ రావు/ వామన్ రావు, నాగమణి దంపతులు (ఫైల్ ఫొటో)

తండ్రి కిషన్ రావు/ వామన్ రావు, నాగమణి దంపతులు (ఫైల్ ఫొటో)

తెలంగాణ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న న్యాయవాద దంపతుల హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వామన్ రావు తండ్రి కిషన్ రావు కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. హత్య జరగడానికి కొద్ది గంటల ముందు..

  తెలంగాణ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న న్యాయవాద దంపతుల హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైకోర్టులో పనిచేసే న్యాయవాదులు వామన్ రావు, ఆయన భార్య నాగమణిపై పగతోనే ఈ దారుణానికి తెగబడినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆడియో టేపు వ్యవహారం, సుఫారీ గ్యాంగ్ తో మాట్లాడిన మాటలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఆడియో టేపు 2018వ సంవత్సరంలోదని తేల్చిన పోలీసులు, దానిపై నిజనిర్ధారణకు సమయం పడుతుందని వెల్లడించారు. మరోవైపు గుంజపడుగులోని కుల దేవత గుడి వివాదం కూడా వారి హత్యకు ప్రధాన కారణమని ఆరోపణలు వస్తున్నాయి. ఇదే సమయంలో వామన్ రావు తండ్రి కిషన్ రావు కొన్ని కీలక విషయాలను వెల్లడించారు.

  ’బుధవారం ఉదయం మంథని కోర్టుకు నా కుమారుడు వామన్ రావు వెళ్లాడు. ఆ విషయాన్ని గుంజపడుగు గ్రామానికి చెందిన పూదరి లచ్చయ్య అనే వ్యక్తి ఆరా తీశాడు. ఆ విషయాన్ని నిందితులకు తెలియజేశాడు. వారి మాటలు విన్న కొందరు వ్యక్తులు నాకు ఫోన్ చేసి చెప్పారు. నా కొడుకు అక్కడికి వెళ్లిన విషయం వీరికి ఎందుకన్న అనుమానం నాకు వచ్చింది. నా కొడుక్కు ఏమైనా హాని తలపెడతారన్న భయం వేసింది. అందుకే ఈ విషయాన్ని వెంటనే నా కుమారుడు వామన్ రావుకు ఫోన్ చేసి చెప్పాను. ’ఎవరు రెక్కీ చేస్తే నాకేంటి? నన్నేం చేస్తారు నాన్నా? నువ్వేం భయపడకు‘ అని తేలిగ్గా తీసేశాడు. ఇంత ఘోరం జరుగుతుందని నేను ఊహించలేకపోయాను‘ అంటూ వామన్ రావు తండ్రి కిషన్ రావు కన్నీటి పర్యంతమయ్యాడు.
  ఇది కూడా చదవండి: న్యాయవాద దంపతుల హత్య కేసు.. ఇవే కారణాలు.. పోలీసులు చెప్పిన విషయాలు

  కాగా, హైకోర్టు న్యాయవాది వామన్‌రావు, ఆయన భార్య నాగమణిని దుండగులు ఫిబ్రవరి 17న అతి కిరాతకంగా నరికి చంపిన సంగతి తెలిసిందే. వామన్ ‌రావు దంపతులు మంథని నుంచి హైదరాబాద్‌కు కారులో వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రామగిరి మండలం సమీపంలో వీరి కారును మరో కారులో వచ్చిన గుర్తు తెలియని దుండగులు అడ్డగించారు. అనంతరం వారిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో దంపతులిద్దరు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అనంతరం వారిని స్థానికులు పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. ఈ ఘటనపై కాస్తా రాజకీయంగా కూడా తీవ్ర రచ్చ జరుగుతోంది. టీఆర్ఎస్ ప్రముఖ నేతకు ఈ హత్యలో హస్తం ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిందితులు కూడా ఆ ప్రముఖ నేతకు బాగా కావాల్సిన వారు కావడంతో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ హత్య కేసును పోలీసులు సవాల్ గా తీసుకున్నారు. గురువారం ఈ హత్య కేసులో నిందితులను పట్టుకున్నారు. హత్యకు సంబంధించిన కారణాలను వెల్లడించారు.
  ఇది కూడా చదవండి: చలసాని శ్రీనివాస్ ఇంట్లో విషాదం.. హైదరాబాద్ లో కుమార్తె ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే..

  ఇటీవల గుంజపడుగులో ఉన్న రామస్వామి గోపాల స్వామి దేవాలయం యాజమాన్య కమిటీ వివాదం,ఇల్లు నిర్మాణం మరియు కుల దేవత అయిన పెద్దమ్మ ఆలయం నిర్మాణం ఆపడంలో వామన్ రావు లిటిగేషన్స్ పెట్టడం వల్ల కుంట శ్రీను తట్టుకోలేకపోయారని.. పాత, కొత్త కక్షలు మనసులో పెట్టుకుని ఆయనను చంపేందుకు కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని.. నిందితులను కస్టడీకి తీసుకొని సాంకేతిక సాక్ష్యాలు డిజిటల్ అండ్ సోషల్ మీడియా సాక్ష్యాలు మరియు ఇతర సాక్ష్యాల ద్వారా దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.
  Published by:Hasaan Kandula
  First published:

  Tags: Bandi sanjay, CM KCR, Revanth reddy, Telangana High Court, Telangana Lawyer Vamanrao Murder

  తదుపరి వార్తలు