పెద్దపల్లి జిల్లాలో నడిరోడ్డుపై దారుణ హత్యకు గురైన న్యాయవాది వామన్‌రావు కుటుంబాన్ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పరామర్శించారు. శనివారం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. వామన్‌రావు స్వగ్రామం మంథని మండలం గుంజపడుగుకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్య వెనక దాగి ఉన్న నిజాన్ని వెలికి తీసే ప్రయత్నంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. పోలీసులు యంత్రాంగం అధికార పార్టీకి తొత్తుగా మారిందని మండిపడ్డారు. ఈ క్రమంలోనే కేసును నీరుగార్చేందుకు యత్నించారని విమర్శించారు.
"శీలం రంగయ్య అనే దళిత వ్యక్తిని టీఆర్ఎస్ పార్టీ నాయకులు హత్య చేస్తే.. ఆ కేసును వామన్‌రావు దంపతులు వాదించారు. వామన్‌రావు ఎక్కడ ఈ కేసు గెలుస్తాడనే భయంతో ఆ దంపతులను హత్య చేసారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వంగవీటి రాధాను హత్య చేసినట్టే.. ఇక్కడ వామన్‌రావు హత్యకు పూనుకున్నారు"అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
వామన్‌రావు దంపతుల హత్య ముమ్మాటికీ టీఆర్ఎస్ పార్టీ కుట్రేనని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. ఉత్తమ్‌తో పాటు వామన్‌రావు కుటుంబసభ్యులను పరామర్శించిన వారిలో శ్రీధర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు, కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గం ఇంచార్జ్ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, పెద్దపల్లి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.