హోమ్ /వార్తలు /తెలంగాణ /

నగరవాసులకు గుడ్ న్యూస్.. ఫస్ట్ లెవల్ ఫ్లైఓవర్ వంతెన ప్రారంభం

నగరవాసులకు గుడ్ న్యూస్.. ఫస్ట్ లెవల్ ఫ్లైఓవర్ వంతెన ప్రారంభం

దీనిపై స్పందించిన జీహెచ్ఎంసీ ఈవీడీం విభాగం వర్మకు రూ. 4 వేల జరిమానా విధించింది.

దీనిపై స్పందించిన జీహెచ్ఎంసీ ఈవీడీం విభాగం వర్మకు రూ. 4 వేల జరిమానా విధించింది.

ఎస్‌ఆర్‌‌డిపి ప్యాకేజి-4 కింద రూ. 379 కోట్ల అంచ‌నా వ్య‌యంతో చేప‌ట్టిన‌ జెఎన్‌టియు నుంచి బ‌యోడైవ‌ర్సిటీ వ‌ర‌కు 12 కిలోమీట‌ర్ల కారిడార్ ప‌నులు మొత్తం పూర్త‌య్యాయని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.

  హైదరాబాద్ నగరవాసులకు జీహెచ్ఎంసీ గుడ్ న్యూస్ చెప్పింది. గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వైపు వెళ్లే వాహనదారులకు ఇక ట్రాఫిక్ ఇక్కట్లు తొలగిపోనున్నాయి. బ‌యోడైవ‌ర్సిటీ జంక్ష‌న్‌లో నిర్మించిన ఫ‌స్ట్ లెవ‌ల్ ఫ్లైఓవ‌ర్‌ను రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కె.తార‌క‌రామారావు ఈ నెల 21న ప్రారంభించ‌నున్న‌ట్లు న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ తెలిపారు. బుధ‌వారం జిహెచ్‌ఎంసి ప్ర‌ధాన కార్యాల‌యంలో త‌న‌ను క‌లిసిన మీడియా ప్ర‌తినిధుల‌తో మాట్లాడుతూ ఎస్‌ఆర్‌‌డిపి ప్యాకేజి-4 కింద రూ. 379 కోట్ల అంచ‌నా వ్య‌యంతో చేప‌ట్టిన‌ జెఎన్‌టియు నుంచి బ‌యోడైవ‌ర్సిటీ వ‌ర‌కు 12 కిలోమీట‌ర్ల కారిడార్ ప‌నులు మొత్తం పూర్త‌య్యాయని తెలిపారు. ఈ ప్యాకేజిలో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు ప‌నుల‌ను ప్రారంభించుకుని ప్ర‌జ‌ల వినియోగంలోకి తెచ్చిన‌ట్లు మేయ‌ర్ తెలిపారు. మైండ్ స్పేస్ అండ‌ర్ పాస్‌, మైండ్‌స్పేస్ ఫ్లైఓవ‌ర్‌, అయ్య‌ప్ప సొసైటి జంక్ష‌న్ అండ‌ర్ పాస్‌, రాజీవ్‌గాంధీ జంక్ష‌న్ ఫ్లైఓవ‌ర్, బ‌యోడైవ‌ర్సిటీ జంక్ష‌న్ లెవ‌ల్ -2 ఫ్లైఓవ‌ర్ల‌ను గ‌తంలోనే ప్రారంభించామని తెలిపారు.

  ఈ నెల 21న బ‌యోడైవ‌ర్సిటీ జంక్ష‌న్ లెవ‌ల్ -1 ఫ్లైఓవ‌ర్ ప్రారంభోత్స‌వంతో ఈ ప్యాకేజిలోని మొత్తం ప‌నులు పూర్తయిన‌ట్లు తెలిపారు. దీంతో గ‌చ్చిబౌలి నుంచి మెహిదీప‌ట్నం వైపు రాయ‌దుర్గ్ వెళ్లే వాహ‌న‌దారుల ట్రాఫిక్ ఇబ్బందులు తొలుగుతాయ‌ని తెలిపారు. రూ. 30 కోట్ల 26 ల‌క్ష‌ల‌తో ఫ‌స్ట్‌ లెవ‌ల్ ఫ్లైఓవ‌ర్ ప‌నులు పూర్తి అయిన‌ట్లు తెలిపారు. ఈ ఫ్లైఓవ‌ర్ పొడ‌వు 690 మీట‌ర్లు, వెడ‌ల్పు 11.50 మీట‌ర్లు ఉన్న‌ట్లు తెలిపారు. మూడు లేన్ల ఈ ఫ్లైఓవ‌ర్‌పై ఒకే వైపు వాహ‌నాల‌ను అనుమ‌తించ‌నున్న‌ట్లు తెలిపారు.

  Published by:Anil
  First published:

  Tags: GHMC, Hyderabad, KTR

  ఉత్తమ కథలు