Home /News /telangana /

LATEST UPDATES OF STANDUP COMEDIAN MUNAWAR FARUQUI SHOW TO BE HELD IN HYDERABAD TODAY PRV

Munawar Faruqui Show: టెన్షన్​.. టెన్షన్​.. హైదరాబాద్​లో మునావర్​ ఫారుఖీ షోపై కీలక అప్​డేట్స్​.. 

మునావర్​ ఫారుఖీ (Photo:Twitter)

మునావర్​ ఫారుఖీ (Photo:Twitter)

స్టాండ్‌ అప్‌ కమిడియన్, లాక్‌ అప్‌ షో విజేత మునావర్‌ ఫారూఖీ లైవ్‌ షోకి సైబరాబాద్‌ ముస్తాబవుతుండగా..ఆయనను అడ్డుకుంటామని, దాడులు చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రటించడంతో నగరంలో వాతావరణం హీటెక్కింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    స్టాండ్‌ అప్‌ కమిడియన్ (Standup comedian), లాక్‌ అప్‌ షో విజేత మునావర్‌ ఫారూఖీ (Munawar Faruqui) లైవ్‌ షోకి సైబరాబాద్‌ ముస్తాబవుతుండగా..ఆయనను అడ్డుకుంటామని, దాడులు చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ (BJP MLA raja singh) ప్రటించడంతో నగరంలో వాతావరణం హీటెక్కింది. ఇవాళ సాయంత్రం మునవర్ కామెడీ షో జరుగనుంది. హైటెక్‌ సిటీలోని శిల్పకళావేదికలో మునావర్‌ షో జరుగనుంది. ఈ నేపథ్యంలోనే మునావర్‌ షో కి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మునావర్‌ షోకి భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసిన సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర… శిల్పకళా వేదిక పరిసర ప్రాంతాల్లో మూడంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

    ఇప్పటికే శిల్పకళా వేదిక ను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు… వందల మంది పోలీసు అధికారులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. మునావర్‌ షో కి వచ్చే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఈ షో టికెట్స్…అమ్ముడయ్యాయి. అటు మునావర్‌ కామెడీ షో (Munawar Faruqui comedy show)ను అడ్డుకుంటామంటూ  రాజాసింగ్ ప్రకటన చేశారు. రాజాసింగ్ ప్రకటన నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు సైబరాబాద్ పోలీసులు. శనివారం లైవ్‌ షో ఉన్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.  ఆయన్ను మొదట లాలాపేట, ఆపై బొల్లారం ఠాణాలకు తరలించారు.



    డోంగ్రీ టు నౌహియర్‌..

    మాదాపూర్‌లోని శిల్పకళా వేదిక (Shilpa kala vedika)లో శనివారం సాయంత్రం 6.30 గంటలకు ‘డోంగ్రీ టు నౌహియర్‌ (Dongri to Nowhir)’ పేరుతో మునావర్‌ షో (Munawar show) ఇస్తున్నారు. మునావర్‌ రాకను, ఈ షోను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాజాసింగ్‌ కొన్ని రోజులుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయనపై దాడులు చేస్తామని గతంలో ప్రకటించారు. తాజాగా పోలీసులు కూడా ఈ షోకు అనుమతి ఇచ్చిన విషయం తెలుసుకున్న ఆయన మునావర్‌తో పాటు ఆయన షో నిర్వహించనున్న వేదికనూ ధ్వంసం చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు.

    Mulugu: ఇన్సురెన్సు కట్టిస్తే వచ్చే జీతం, కమిషన్​ చాలడం లేదని ఆ ఏజెంట్​ ఎంతటి దారుణానికి ఒడిగట్టాడో తెలుసా?

    ఈ షో కు అనుమతి ఉందని, అవసరమైన భద్రత, బందోబస్తు కల్పిస్తామని మాదాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ రవీంద్ర ప్రసాద్‌ తెలిపారు. శిల్పకళా వేదిక, మాదాపూర్‌ పరిసరాలలో పోలీసులు శనివారం ఉదయం నుంచి బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఈ లైవ్‌ షోకు రెండు వేల మంది వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. టికెట్‌తో వచ్చే ప్రతి ఒక్కరినీ పూర్తిస్థాయిలో తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించనున్నారు.

    కేటీఆర్​ పిలుపుతో..

    ఈ ఏడాది ఏక్తా కపూర్ నిర్వహించిన క్యాఫ్టివ్ రియాలిటీ షో లాక్ అప్ లో మునావర్ విజేతగా నిలిచారు. మునావర్ ఫారుఖీకి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ (KTR) బహిరంగంగా ఆహ్వానం పలికారు.ఈ ఏడాది జనవరిలో మునావర్ ఫరూఖీ హైదరాబాద్ లో షో జరపాలని ప్లాన్ చేశారు. అయితే కొవిడ్ కారణంగా వాయిదా పడింది. గతంలోనూ మునావర్ ఫారుఖీ షో విషయంలో అనేక సార్లు హెచ్చరించారు ఎమ్మెల్యే రాజాసింగ్. తాజాగా మరోమారు మునావర్ ఫారూఖీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మళ్ళీ ఆయన కార్యక్రమాన్ని రద్దు చెయ్యాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

    అయితే షోపై అంచనాలు ఎక్కువగా ఉండటం, మరోవైపు దాడులకూ ఆస్కారం ఉండటంతో అనుమానితులు కనిపిస్తే ముందస్తు అరెస్ట్‌లు తప్పవని పోలీసులు పేర్కొంటున్నారు. ఇప్పటికే మునావర్‌ ఫారూఖీ షోకు సంబంధించిన ఎంట్రీ టికెట్లు ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. షో ఎక్కడ అనే అంశాన్ని ఆ వెబ్‌సైట్‌ శుక్రవారం రాత్రి 7 గంటల వరకు సైతం ప్రకటించలేదు. మునావర్‌ తన ఇన్​స్టాగ్రామ్​లో డోంగ్రీ టు నో హియర్‌ పేరుతో లైవ్‌ షో ఉందని ప్రకటించిన నాటి నుంచి ఎమ్మెల్యే రాజా సింగ్‌ తీవ్రంగా స్పందిస్తున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Hyderabad, Hyderabad police, KTR, Raja Singh, Telangana bjp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు