Home /News /telangana /

Land Registrations : సగానికి పడిపోయిన రిజిస్ట్రేషన్లు.. లాక్‌డౌన్ నిబంధనలతో అరకోర ఆదాయం

Land Registrations : సగానికి పడిపోయిన రిజిస్ట్రేషన్లు.. లాక్‌డౌన్ నిబంధనలతో అరకోర ఆదాయం

Land Registrations : రాష్ట్ర ఆదాయానికి ప్రధాన వనరుగా ఉన్న రిజిష్ట్రేషన్ల శాఖ ఆదాయం అంతంతమాత్రంగానే కొనసాగుతోంది..లాక్‌డౌన్ నేపథ్యంలోనే 18 రోజుల పాటు రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం తిరిగి సోమవారం ప్రారంభించింది..అయితే లాక్‌డౌన్ తర్వాత ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు సగానికి పైగా పడిపోయాయి.

ఇంకా చదవండి ...
లాక్‌డౌన్‌తో భూముల అమ్మకాలు కొనుగోళ్లకు కూడా బ్రేక్ పడింది.అయితే 18 రోజుల బంద్ అనంతరం తిరిగి గత సోమవారం ఆంక్షలతో కూడిన రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. లాక్‌డౌన్ నిబంధనల సడలింపుతో పాటు రిజిస్ట్రేషన్లకు కొన్ని నిబంధనలు విధించి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.. ఈ నేపథ్యంలోనే

రాష్ట్రంలో 18 రోజుల తర్వాత సోమవారం నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలైంది. రాష్ట్రంలోని 141 సబ్​రిజిస్ట్రార్ కార్యాలయాలల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. లాక్‌డౌన్‌ సడలింపు సమయాలను పొడిగించగా.. రిజిస్ట్రేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం పలు ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చింది. కాగా సాధారణ రోజుల్లో నేరుగా వచ్చి రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం ఉండగా ప్రస్తుత పరిస్థితుల్లో స్లాట్ బుకింగ్ ద్వారనే రిజిస్ట్రేషన్లకు అవకాశం ఇవ్వడంతో పాటు కేవలం సాక్షులకు మాత్రమే పాసులు జారీ చేసి అనుమతి ఇచ్చింది.

అయితే ఈ నిబంధనలతో రిజిస్ట్రేషన్‌లు భారీగానే పడిపోయాయి. లాక్​డౌన్ అమలులో ఉండడం వల్ల వ్యాపార, వాణిజ్య సంస్థలు అరకొరగానే తెరుచుకుంటున్నాయి. జనం బయపడి బయటకు రాకపోవడం వల్ల వ్యవసాయేతర భూములు, ఆస్తులు క్రయవిక్రయాలు పడిపోయాయి. ఈ పరిణామాలతో రిజిస్ట్రేషన్లు ఆశించిన మేర జరగడం లేదు. గత నెల 31న మొదటి రోజు కేవలం 578 డాక్యుమెంట్లు, రెండో రోజున 1148 రిజిస్ట్రేషన్లు, మూడో రోజున 1001 రిజిస్ట్రేషన్లయ్యాయి. మొత్తం కలిసి కేవలం 2,727 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషనై... దాదాపు 40 కోట్లు రూపాయలు మాత్రమే ఆదాయం వచ్చింది. సాధరణ రోజుల్లో అయితే... రోజుకు నాలుగు వేలకు పైనే రిజిస్ట్రేషన్స్ జరిగేవి దీంతో 50 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరేది..

రాష్ట్రంలో మొత్తం 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా... సగం వాటిలో ఒకటి కూడా రిజిస్ట్రేషన్ కాలేదని, ఇలాంటివి అన్ని కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. లాక్​డౌన్ ఎత్తివేసి సాధారణ పరిస్థితులు నెలకొంటే కానీ... క్రమంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఊపందుకోదని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మీ నగరం నుండి (​హైదరాబాద్)

తెలంగాణ
​హైదరాబాద్
తెలంగాణ
​హైదరాబాద్
Published by:yveerash yveerash
First published:

Tags: Land registration, Telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు